ITR Filing: 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్(ఆదాయపు పన్ను రిటర్న్‌లు) దాఖలు చేయడానికి జులై 31తో చివరి తేదీ గడువు ముగియనుంది. రిటర్న్‌ల ఫైలింగ్‌కు కొన్ని గంటలే మిగిలున్న నేపథ్యంలో ఆదాయపు పన్ను శాఖ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రకటించింది. ఇప్పటికైతే గడువు పొడిగింపు సూచనలేవీ కనిపించడం లేదు. అపరాధ రుసుము సమస్యలను ఎదుర్కొనకుండా పన్ను చెల్లింపుదారులు తమ రిటర్న్‌లను సకాలంలో దాఖలు చేయాలని పేర్కొంది. గడువు ముగిసిన తర్వాత కొత్త పన్నుల విధానంలో మాత్రమే ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేయడానికి వీలుంటుంది. దాని వల్ల అదనంగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
Read Also: AP Govt: ఓటాన్ అకౌంట్ బడ్జెట్పై రాష్ట్ర ప్రభుత్వ ఆర్డినెన్స్..
ఇదిలా ఉండగా.. ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో చిన్న చిన్న సమస్యలు వెంటాడుతున్నాయి. దీంకో కొందరు వినియోగదారులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పాటు గడువు పెంచాలని ఆదాయపు పన్ను శాఖను విజ్ఞప్తి చేస్తున్నారు. గడువు పెంచే ఉద్దేశమే లేదని ఐటీ శాఖ ఇప్పటికీ స్పష్చం చేసింది. జులై 30 వరకు 6 కోట్లు మంది ఐటీఆర్‌లు దాఖలు చేశారని.. గతేడాదితో పోలిస్తే గణనీయంగా పెరిగిందని ఆదాయపు పన్ను శాఖ ప్రకటించింది.