ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!

  • నేడు (జూలై 31) ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేయడానికి చివరి గడువు..
  • ITR ఫైల్ చేసిన రోజే ఈ-వెరిఫికేషన్ చేయడం తప్పనిసరి కాదు..
  • టర్న్ ఫైల్ చేసిన తేదీ నుంచి 30 రోజులలోపు ఈ-వెరిఫికేషన్ పూర్తి చేస్తే చాలు..
Itr Filing Deadline

Itr Filing Deadline

ITR Filing Deadline: ఆదాయపు పన్ను (Income Tax) రిటర్న్ దాఖలు చేసే గడువు నేటితో (జూలై 31) ముగియనుంది. ఇంకా ITR ఫైల్ చేయని పన్ను చెల్లింపుదారులు తప్పనిసరిగా ఈరోజే రిటర్న్ సమర్పించాలని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. అయితే చాలామందికి ఉన్న సందేహం ఏమిటంటే.. ITR ఫైల్ చేసిన వెంటనే ఈ-వెరిఫికేషన్ కూడా పూర్తిచేయాలా.? లేదా.? అని. అయితే దీనిపై ఆదాయపు పన్ను నిబంధనలు స్పష్టమైన వెసులుబాటును కల్పిస్తున్నాయి.

ITR ఫైల్ చేసిన వెంటనే ఈ-వెరిఫికేషన్ తప్పనిసరా?

లేదు.. జూలై 31లోపు ITR ఫైల్ చేస్తే, అదే రోజున ఈ-వెరిఫికేషన్ చేయాల్సిన అవసరం లేదు. రిటర్న్‌ను అప్లోడ్ చేసిన తేదీ నుంచి 30 రోజులలోపు ఈ-వెరిఫికేషన్ పూర్తి చేస్తే, మీ అసలు ఫైలింగ్ తేదీ యథాతథంగా కొనసాగుతుంది. అంటే, మీరు జూలై 31న ITR ఫైల్ చేసి, ఆగస్టులో 30 రోజుల గడువులోపు ఈ-వెరిఫికేషన్ పూర్తి చేసినా.. మీ రిటర్న్‌ను జూలై 31న ఫైల్ చేసినట్టుగానే పరిగణిస్తారు.

30 రోజులు దాటితే.?

ఒకవేళ 30 రోజుల తర్వాత ఈ-వెరిఫికేషన్ చేస్తే.. వెరిఫికేషన్ చేసిన తేదీనే ఫైలింగ్ తేదీగా పరిగణించే అవకాశం ఉంది. దీంతో మీ రిటర్న్ ‘Belated Return’ (ఆలస్యంగా దాఖలు చేసిన రిటర్న్)గా మారవచ్చు. అంతేకాదు, డిసెంబర్ 31, 2026లోపు కూడా ఈ-వెరిఫికేషన్ చేయకపోతే, మీ ITR చెల్లనిదిగా (Invalid Return) పరిగణించే అవకాశం ఉంది. ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఆదాయపు పన్ను శాఖ ఆలస్యాన్ని సముదాయిస్తుంది.

ఈ-వెరిఫికేషన్ ఎలా.?

పన్ను చెల్లింపుదారులు వివిధ మార్గాల్లో సులభంగా ఈ-వెరిఫికేషన్ పూర్తి చేయవచ్చు. ఆధార్ OTP, నెట్ బ్యాంకింగ్, Electronic Verification Code (EVC), Digital Signature Certificate (DSC) ద్వారా ఈ-వెరిఫికేషన్ పూర్తి చేయవచ్చు. ఈ సదుపాయాలు ఉపయోగించలేని వారు సంతకం చేసిన ITR-V ఫారమ్ ను నిర్ణీత విధానంలో సమర్పించాల్సి ఉంటుంది.

నిబంధనల ప్రకారం 30 రోజుల గడువు ఉన్నప్పటికీ.. ITR ఫైల్ చేసిన వెంటనే ఈ-వెరిఫికేషన్ పూర్తి చేయడం ఉత్తమం. దీంతో రిటర్న్ వేగంగా ప్రాసెస్ అవుతుంది. అలాగే Belated Return లేదా Invalid Returnగా మారే ప్రమాదం కూడా ఉండదు. కాబట్టి.. ఇంకా ITR ఫైల్ చేయని వారు జూలై 31లోపు రిటర్న్ సమర్పించి, ఆ తర్వాత 30 రోజులలోపు ఈ-వెరిఫికేషన్ పూర్తి చేయాలని ఆదాయపు పన్ను శాఖ సూచిస్తోంది.