NTV Telugu Site icon

Raghava Reddy Movie: ‘రాఘవ రెడ్డి’ చిత్రం నుంచి ఐటెమ్ సాంగ్ రిలీజ్..

Raghava Reddy

Raghava Reddy

‘చదివిందేమో టెన్త్ రో.. అయిందేమో డాక్టర్’ అంటూ అమ్మడు పాడే పాటకి కుర్రకారు అంతా మైమరచిపోతున్నారు. ఇంతకీ టెన్త్ క్లాస్ చదివి డాక్టర్ అయిన అమ్మాయెవరో తెలుసుకోవాలంటే మాత్రం ‘రాఘవ రెడ్డి’ సినిమా చూడాల్సిందే అంటున్నారు మేకర్స్. శివ కంఠమనేని హీరోగా రాశి, నందితా శ్వేత ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘రాఘవ రెడ్డి’. స్పేస్ విజన్ నరసింహా రెడ్డి సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యూజిక్ బ్యానర్‌పై సంజీవ్ మేగోటి దర్శకత్వంలో KS శంకర్ రావ్, R.వెంకటేశ్వర్ రావు, G.రాంబాబు యాదవ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

Read Also: ABC Juice: పెరుగుతున్న పిల్లలకు ABC జ్యూస్ ఇవ్వండి.. చదువులో దూసుకుపోతారు..!

‘రాఘవరెడ్డి’ మూవీ జనవరి 5న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ శనివారం ‘రాఘువ రెడ్డి’ నుంచి ‘చదివిందేమో టెన్త్ రో.. అయిందేమో డాక్టర్’ అనే ఐటెమ్ సాంగ్‌ను విడుదల చేసింది. ఈ పాటకు సుధాకర్ మారియో సంగీతాన్ని అందించారు. సాగర్ నారాయణ్ సాహిత్యాన్ని అందించారు. ప్రముఖ సింగర్ మంగ్లీ ఈ పాటను ఆలపించారు. ఈ సందర్భంగా.. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఘంటా శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. ‘లైట్ హౌస్ సినీ మ్యూజిక్ బ్యానర్‌‌లో వస్తోన్న మూడో సినిమా ఇది. శివ కంఠమనేనిగారిని కొత్తగా ప్రెజెంట్ చేస్తున్నాం. అన్ని వర్గాల ఆడియెన్స్‌ని ఆకట్టుకునే కథాంశంతో రూపొందిన ఈ సినిమాను జనవరి 5న గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నాం. ట్రైలర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మంగ్లీగారు పాడిన ‘చదివిందేమో టెన్త్ రో.. అయిందేమో డాక్టర్’ సాంగ్ విడుదల చేశాం. ప్రేక్షకులు మా చిత్రాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాం’ అని అన్నారు.

Read Also: YSR Pension Kanuka: హామీని సంపూర్ణంగా నెరవేర్చిన సీఎం జగన్‌.. ఇకపై ప్రతినెలా రూ.3వేలు..