మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్‌ప్లే, IR బ్లాస్టర్తో రాబోతున్న Itel Zeno 100 Pro.!

Itel Zeno 100 Pro

Itel Zeno 100 Pro

Itel Zeno 100 Pro: భారత మార్కెట్‌లో తన ఉనికిని కంపెనీ త్వరలో Itel Zeno 100 Proతో పాటు Itel Zeno 100 Lite స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేయనుంది. లాంచ్‌కు ముందే ఈ ఫోన్‌లకు సంబంధించిన ప్రత్యేక మైక్రోసైట్‌లను విడుదల చేసిన కంపెనీ.. కొన్ని కీలక ఫీచర్లను తెలిపింది. ముఖ్యంగా ఈ రెండు ఫోన్‌లలో డ్యూరబిలిటీపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు కనపడుతుంది. ఈ ఫోన్‌లో MIL-STD 810H Military-Grade Durability సర్టిఫికేషన్‌ను అందిస్తున్నారు. అలాగే హీట్ రెసిస్టెన్స్, డ్రాప్ రెసిస్టెన్స్ వంటి రక్షణ ఫీచర్లు కూడా ఇందులో ఉంటాయని కంపెనీ తెలిపింది.

IR బ్లాస్టర్:

టీజర్‌లో కనిపించిన “Point and Tap Control Connectivity” ఫీచర్‌ను బట్టి ఈ ఫోన్‌లో IR బ్లాస్టర్ ఉండే అవకాశం కనిపిస్తోంది. దీంతో టీవీ, ఎయిర్ కండీషనర్ వంటి IR సపోర్ట్ ఉన్న గృహోపకరణాలను నేరుగా ఫోన్‌తో నియంత్రించవచ్చు. అలాగే వెనుక భాగంలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉన్నట్లు టీజర్ ద్వారా తెలుస్తోంది. అయితే కెమెరా సెన్సార్‌ల పూర్తి వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

Itel Zeno 100 Lite:

ఐటెల్ జెనో 100 లైట్ కోసం విడుదల చేసిన మైక్రోసైట్‌లో కొన్ని స్పెసిఫికేషన్లు ఇప్పటికే వెల్లడయ్యాయి. ఈ ఫోన్‌లో 6.6 అంగుళాల HD+ డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్, DTS సపోర్ట్‌తో స్పీకర్లు, MIL-STD మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5,000mAh బ్యాటరీ వంటి ఫీచర్లు ఉండనున్నాయి. “Lite” అనే పేరును బట్టి చూస్తే.. ఈ మోడల్ Zeno 100 Pro కంటే తక్కువ ధరలో వచ్చే వేరియంట్‌గా ఉండే అవకాశం ఉంది. లాంచ్ తేదీని కంపెనీ ఇంకా ప్రకటించలేదు. అయితే జూలై 16న Zeno 100 Proతో పాటు ఈ ఫోన్‌ను కూడా లాంచ్ అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

అమెజాన్‌లో అందుబాటులో ఉన్న అధికారిక మైక్రోసైట్ ప్రకారం Itel Zeno 100 Pro భారత మార్కెట్‌లో జూలై 16న లాంచ్ కానుంది. రోజువారీ వినియోగంలో కఠిన పరిస్థితులను కూడా తట్టుకునేలా ఈ ఫోన్‌ను రూపొందించినట్లు కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం ఈ రెండు ఫోన్‌ల ధరలు, ప్రాసెసర్, కెమెరా వివరాలు, సాఫ్ట్‌వేర్ ఫీచర్లపై అధికారిక సమాచారం లేదు. లాంచ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ కంపెనీ మరిన్ని వివరాలను వెల్లడించనుంది.