NTV Telugu Site icon

Tirupati: నేడు తిరుపతికి ముగ్గురు ముఖ్యమంత్రులు!

Itcx 2025

Itcx 2025

నేడు తిరుపతికి ముగ్గురు ముఖ్యమంత్రులు రానున్నారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్‌లు తిరుపతికి రానున్నారు. తిరుపతిలో జరగనున్న రెండవ ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్ పో ప్రారంభోత్సవంకు ముగ్గురు ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు.

ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్ పో సమావేశం మూడు రోజుల పాటు జరగనుంది. ఈ మూడు రోజులు నిపుణుల నేతృత్వంలో దేవాలయాలపై చర్చలు, ప్రదర్శనలు, వర్క్ షాపులు జరగనున్నాయి. 58 దేశాలలోని 1,581దేవాలయాలను ఒకే వేదికపై అనుసంధానించడం, సస్టైనబిలిటీ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ, టెంపుల్ గవర్నెన్స్ అండ్ కంప్లయన్స్ టెంపుల్ ఎకానమీ, స్మార్ట్ టెంపుల్ సొల్యూషన్స్ వంటి అంశాలపై మూడు రోజుల పాటు చర్చ జరగనుంది.