Site icon NTV Telugu

ChatGPT: ఇటలీలో చాట్‌జీపీటీపై తాత్కాలిక నిషేధం

Chatgpt

Chatgpt

ChatGPT: ప్రస్తుతం టెక్‌ వర్గాల్లో చాట్‌జీపీటీ ఒక సంచలనంగా మారింది. దీనిపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. దీని వాడకంలోని నైతికతపై అనేక అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే కాపీరైట్‌ హక్కుల ఉల్లంఘనలను నిపుణులు తెరపైకి తెస్తున్నారు. ముఖ్యంగా ఇది విద్యార్థుల చేతుల్లోకి వెళ్లడం వల్ల వారి అభ్యసన సామర్థ్యం దెబ్బతినే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తోంది. ఇదిలా ఉండగా.. ఇటలీలో డేటా సేకరణపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో చాట్‌జీపీటీ తాత్కాలికంగా నిషేధించబడింది

ఇటీవల బెంగళూరులోని ఆర్‌వీ విశ్వవిద్యాలయం, న్యూయార్క్‌ ఎడ్యుకేషన్‌ బోర్డ్‌ చాట్‌జీపీటీ వాడకాన్ని నిషేధించిన సంగతి తెలిసిందే. యూనివర్సిటీ ఆఫ్‌ హాంకాంగ్‌ కూడా చాట్‌జీపీటీ సహా కృత్రిమ మేధ ఆధారిత టూల్స్‌ను వాడొద్దని ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులు అసైన్‌మెంట్లు సహా ఇతర ఎలాంటి ప్రాజెక్టులను పూర్తి చేయడంలో వీటిని ఉపయోగించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. ప్రొఫెసర్లు కూడా బోధనలో వీటిని వాడొద్దని ఆదేశించింది. తాజాగా శుక్రవారం, ఇటాలియన్ డేటా ప్రొటెక్షన్ ఏజెన్సీ ఇటాలియన్ వినియోగదారుల డేటాను సేకరించకుండా చాట్‌బాట్‌ను తక్షణమే బ్లాక్ చేస్తామని ప్రకటించింది. అయితే అధికారులు చాట్‌జీపీటీ వెనుక ఉన్న కాలిఫోర్నియా కంపెనీ OpenAIని విచారించారు.

Read Also: US Canada Border : సరిహద్దు దాటుతూ భారతీయ కుటుంబం దుర్మరణం

మార్చి 20న చాట్‌బాట్ డేటా ఉల్లంఘనను ఎదుర్కొన్న తర్వాత, కొంతమంది వినియోగదారుల వ్యక్తిగత డేటా, వారి చాట్ చరిత్ర, చెల్లింపు సమాచారం వంటి వాటిని ప్రమాదంలో పడేసిన తర్వాత విచారణ జరిగింది. కానీ ఇటాలియన్ ప్రభుత్వ దృష్టిలో డేటా ఉల్లంఘన మాత్రమే ఆందోళన కలిగించలేదు. ఏజెన్సీ OpenAI డేటా సేకరణ పద్ధతులను, నిల్వ చేయబడిన డేటా చట్టబద్ధమైనదా అని ప్రశ్నించింది. మైనర్లు అనుచితమైన సమాచారాన్ని గురించి తెలుసుకోకుండా నిరోధించేందుకు వయస్సు ధ్రువీకరణ వ్యవస్థ లేకపోవడాన్ని కూడా ఇటాలియన్‌ ఏజెన్సీ OpenAIని ప్రశ్నించింది.

Exit mobile version