NTV Telugu Site icon

PM Modi : వైరల్ గా మారిన జార్జియా మెలోనీ, ప్రధాని మోడీ సెల్ఫీ వీడియో..

Modi

Modi

భారత్, ఇటలీ దేశాల ప్రధానుల మధ్య ఉన్న స్నేహబంధం కెమెరాకు చిక్కింది. ప్రధాని మోడీ ని మెలోని కలిసినప్పుడు, ఇరువురు నేతలు నమస్తే సంజ్ఞలతో ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఆహ్లాదాన్ని పంచుకుంటూ, ఇరువురు నేతలూ వారి సంభాషణ తర్వాత నవ్వారు ఈ వీడియోలో. ఇకపోతే G7 శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోడీ పాల్గొనడం ఇది వరుసగా ఐదవసారి. గత పది శిఖరాగ్ర సమావేశాలకు భారత్ హాజరయ్యారు. ఇటలీ G7 అధ్యక్షుడిగా యూరోపియన్ యూనియన్‌తో పాటు కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, ఇంగ్లాండ్, అమెరికాతో సహా ఏడు ప్రధాన ఆర్థిక వ్యవస్థల కూటమికి ఆతిథ్యం ఇచ్చింది.

Addanki Dayakar: “అన్నీ మీరే కదా చేసింది”..కేసీఆర్ పై అద్దంకి దయాకర్ ఫైర్

శుక్రవారం నాడు ప్రధాని మోడీ మెలోనితో ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో రెండు దేశాల మధ్య రక్షణ, భద్రతా సహకారంపై చర్చించారు. ద్వైపాక్షిక రక్షణ, భద్రతా సహకారంపై ఇరుపక్షాలు చర్చించాయి. అలాగే రక్షణ పారిశ్రామిక సహకారాన్ని మరింత మెరుగుపరుచుకోవాలని ఆశిస్తున్నాయి. ఈ ఏడాది చివర్లో ఇటాలియన్ విమాన వాహక నౌక ITS కావూర్, శిక్షణ నౌక ITS విస్పుసీసీ భారతదేశానికి రాబోయే సందర్శనను వారు స్వాగతించారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది.

Kumari Aunty: అనుకున్నదే అయింది.. కుమారి ఆంటీ సాధించేసింది!!

G7 సమ్మిట్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని కొత్త సెల్ఫీకి పోజులిచ్చారు. ఫోటో తర్వాత కొద్దిసేపటికే, మెలోని తన అధికారిక X హ్యాండిల్‌లో ఇద్దరు నాయకుల వీడియోను పంచుకున్నారు. వీడియో క్లిప్‌లో, ఇటలీ ప్రధాని మెలోని హల అని చెప్పినప్పుడు ఇద్దరు నాయకులూ కెమెరా వైపు చేతులు ఊపుతూ కనిపించారు. ఇక ఆమె పోస్ట్‌ పై ప్రధాని మోడీ స్పందిస్తూ., “భారత్-ఇటలీ స్నేహం చిరకాలం జీవించాలని” రాసుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి పోస్ట్ వైరల్ గా మారింది.