NTV Telugu Site icon

Sania Mirza Father: సానియా మీర్జా మాలిక్కు ఖులా ఇచ్చింది..

Sania Father

Sania Father

పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ పాకిస్థాన్ నటి సనా జావేద్‌ను వివాహం చేసుకోవడంపై సానియా మీర్జా తండ్రి స్పందించారు. మాలిక్- సానియా మీర్జా విడాకులు తీసుకున్నారని అని తెలిపారు. ‘షరియా చట్టంలో ఉన్న ఖులా పద్ధతి ప్రకారం ముస్లిం మహిళ భర్తకు విడాకులు ఇచ్చే స్వేచ్ఛ ఉంటుందని తెలిపారు. తన కూతురు సానియా కూడా ఖులా ప్రకారం షోయబ్ కు విడాకులు ఇచ్చిందని పేర్కొన్నారు.

Read Also: Niranjan Reddy: కాంగ్రెస్ మంత్రులు చిన్న పిల్లల్లా మాట్లాడుతున్నారు..

కాగా.. షోయ‌బ్ మాలిక్ ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్లుగా భార్య సానియా మీర్జాకు దూరంగా ఉంటున్న అత‌ను.. పాక్‌కు చెందిన న‌టి స‌నా జావెద్‌ను పెళ్లి చేసుకున్నాడు. త‌మ పెండ్లి వేడుక ఫొటోల‌ను షోయ‌బ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. సానియా మీర్జా, షోయబ్ మాలిక్ 12 ఏప్రిల్ 2010న వివాహం చేసుకున్నారు. దీనిపై అప్పట్లో తీవ్ర దుమారం రేగింది. సానియా పాకిస్థానీని పెళ్లాడిందన్న వార్తలు తీవ్ర దుమారం రేపాయి. షోయబ్ మాలిక్ పెళ్లి వార్త తెలిసిన వెంటనే ట్విట్టర్‌లో జనం గుమిగూడారు. యూజర్లు రకరకాల కామెంట్స్ తో నెటిజన్స్ షోయబ్ మాలిక్ ను ఆడేసుకుంటున్నారు. వారిలో నెటిజన్ ‘షోయబ్ మాలిక్ మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. లీ, కానీ బాబర్ ఆజం ఇప్పటికీ ఒంటరిగా తిరుగుతున్నాడంటూ రాసుకొచ్చాడు. ఇక.. నటి సనా జావేద్‌ విషయానికొస్తే, మాలిక్‌ లానే జావేద్‌కు కూడా అంతకుముందు వివాహమైంది. ఆమె 2020లో పాకిస్థానీ గాయకుడు ఉమైర్ జస్వాల్‌ను పెళ్లి చేసుకుంది.

Read Also: Mohan Babu: అయోధ్యకు రమ్మని ఆహ్వానం.. ఆ కారణంగా రాలేనని మోహన్ బాబు లేఖ

Show comments