Site icon NTV Telugu

IT Raids on DSR Group: DSR గ్రూప్ కంపెనీల్లో ఐటీ సోదాలు.. టాక్స్ చెల్లింపులలో భారీగా అవకతవకలు!

It Raids On Dsr Group

It Raids On Dsr Group

IT Raids on DSR Group: హైదరాబాద్‌లో ప్రముఖ DSR గ్రూప్ ఆఫ్ కంపెనీలపై ఆదాయపు పన్ను శాఖ (IT) అధికారులు సోదాలు చేపట్టారు. నేడు ఉదయం నుండి ప్రారంభమైన ఈ సోదాలు కంపెనీకి చెందిన కార్యాలయాలతో పాటు డైరెక్టర్ల నివాసాల్లోనూ కొనసాగుతున్నాయి. అందిన వివరాల ప్రకారం DSR ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, దాని ఇతర అనుబంధ సంస్థల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఒకేసారి దాదాపు 10 చోట్ల ఈ సోదాలు జరుగుతున్నాయి.

Honey Trap: ఆన్‌లైన్ డేటింగ్ యాప్‌లో అమ్మాయితో పరిచయం.. అసభ్యకరంగా ఫోటోలను మార్ఫింగ్ చేసి?

ఇందుకు సంబంధించి జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, SR నగర్, సురారం ప్రాంతాలలో ఐటీ డిపార్మెంట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ సోదాలు.. కంపెనీ పన్నుల చెల్లింపుల్లో భారీగా అవకతవకలు జరిగాయని ఐటీ శాఖకు అనుమానం రావడంతో జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీనితో కంపెనీకి సంబంధించిన గత ఐదు సంవత్సరాల పన్ను చెల్లింపులపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ సోదాలు సజావుగా కొనసాగేందుకు CRPF బలగాలను కూడా మోహరింప చేశారు అధికారులు.

ChatGPT Go: చాట్జీపీటీ వినియోగదారులకు శుభవార్త.. ఇకపై తక్కువ ధరకే సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌!

ఈ క్రమంలో, DSR గ్రూప్ ఎండీ సుధాకర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి, సీఈఓ సత్యనారాయణరెడ్డి నివాసాలు, కార్యాలయాల్లోనూ అధికారులు తనిఖీలు జరుపుతున్నారు. ఐటీ శాఖ సేకరించిన డాక్యుమెంట్ల ఆధారంగా మరిన్ని వివరాలు వెలువడే అవకాశముంది.

Exit mobile version