Site icon NTV Telugu

MeeSeva services on WhatsApp: వాట్సాప్ లో “మీ సేవ” సేవలు.. ప్రారంభించిన ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు..

Sridhar Babu

Sridhar Babu

రాష్ట్రంలో మీ సేవ సేవలు అందుబాటులోకి వచ్చాక కుల, ఆదాయ వంటి ఇతరత్రా సర్టిఫికెట్స్ పొందడం ఈజీ అయిపోయింది. అయితే ఈ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పదే పదే మీ-సేవ కేంద్రాలకు వెళ్లే శ్రమ తగ్గించడానికి, మీ-సేవకు సంబంధించిన అన్ని సేవలను ఇకపై వాట్సాప్ ద్వారానే అందించనుంది. తెలంగాణలో ఇకపై వాట్సాప్‌లోనే మీ-సేవ సర్టిఫికెట్లు అందనున్నాయి. వాట్సాప్ మీసేవ సర్వీసులను(మీ సేవ సర్వీసెస్ ఆన్ వాట్సాప్) బంజారాహిల్స్ లోని తాజ్ కృష్ణలో మంత్రి శ్రీధర్ బాబు లాంఛనంగా ప్రారంభించారు.

Also Read:Karumuri Venkata Reddy Arrest: మరో వైసీపీ నేత అరెస్ట్.. అసలు కారణం ఏంటి..? అని అంబటి ఫైర్‌

38 ప్రభుత్వ విభాగాలకు చెందిన 580కి పైగా మీ సేవా సర్వీసులను వాట్సాప్ ద్వారా పొందే విధంగా ఏర్పాట్లు చేశారు. మెటా, మీ సేవ సంయుక్త భాగస్వామ్యంతో ఈ సౌకర్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. మీ సేవ సెంటర్స్ చుట్టూ తిరిగే పని లేకుండా సేవలను సులభతరం చేసింది తెలంగాణ ప్రభుత్వం.. వినియోగదాలు వాట్సాప్ లోనే సర్టిఫికెట్స్ పొందే అవకాశం కల్పించింది. మీ-సేవ సెంటర్‌లో దరఖాస్తు చేసుకున్న తర్వాత దానికి సంబంధించిన తాజా అప్‌డేట్స్ అన్నీ వాట్సాప్‌లోనే చెక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా దరఖాస్తు చేసిన సర్టిఫికెట్ ఆమోదం పొందితే ఆ సర్టిఫికెట్‌ను సైతం వాట్సాప్ ద్వారానే డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు.

Also Read:Bomb Threat: ఢిల్లీ స్కూళ్లు, కోర్టులకు మరోసారి బాంబ్ బెదిరింపులు.. డాగ్‌స్క్వాడ్స్‌తో తనిఖీలు

8096958096 వాట్సాప్ నెంబర్ ద్వారా మీ సేవ ఆన్లైన్ సర్వీసెస్ ఉపయోగించుకోవచ్చు. ఇన్కమ్ సర్టిఫికెట్, బర్త్ సర్టిఫికెట్, డెత్ సర్టిఫికెట్, రెసిడెన్సీ సర్టిఫికెట్, కమ్యూనిటీ & డేట్ ఆఫ్ బర్త్, పోలీస్ చలాన్, రెన్యువల్ ఆఫ్ రేషన్ షాప్స్, టెంపుల్ సర్వీసెస్, బిల్డింగ్ పర్మిషన్, వెహికిల్ లైఫ్ ట్యాక్స్, లైసెన్స్, ప్రాపర్టీ ట్యాక్స్ సేవలు ఇక వాట్సాప్ లోనే పొందొచ్చు. త్వరలోనే మరిన్ని వాట్సాప్ సర్వీసులను ప్రారంభించనున్నది ప్రభుత్వం.. వాట్సాప్ లో 580 ప్రభుత్వ సర్వీసెస్ ను అందించడానికి ప్రభుత్వ ప్రణాళికలు చేస్తోంది.

Exit mobile version