NTV Telugu Site icon

Heavy Rains: ఇటు భారత్ నే కాదు.. అటు చైనాను వణికిస్తున్న భారీ వర్షాలు

China Rains

China Rains

ప్రస్తుతం భారతదేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో అయితే, భారీ వర్షాలకు తోడు బీభత్సమైన వరదతో అక్కడ గ్రామాలు పూర్తిగా జలమయం అయ్యాయి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్, ఢిల్లీ రాష్ట్రాల్లో పడుతున్న భారీ వానాలకు జనజీవనం అస్థవ్యస్తం అయ్యింది. దీంతో వరదల్లో చిక్కుకున్న వారిని రెస్య్కూ టీమ్స్ కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అయితే, ప్రస్తుతం చైనాలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా చైనాలోని సిచువాన్‌ ప్రావిన్స్‌లో గల మైన్‌యాంగ్‌ సిటీ పూర్తిగా నీట మునిగింది. భారీ వర్షాల కారణంగా మైన్‌యాంగ్‌లోని ఒక బ్రిడ్జిపైకి చేరుకున్న నీరు కిందకు ప్రవహిస్తోంది. వరద బాధిత ప్రాంతాల్లోని 40 వేల మంది బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు సంబంధిత అధికారులు వెల్లడించారు.

Read Also: Today Gold Price: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్లు ఎలా ఉన్నాయంటే?

ఇదేవిధంగా చైనాలోని చోంగ్‌కింగ్‌ నగర పరిధిలో 9వేల 700 మంది తుఫాన్ బాధితులను సురక్షిత ప్రాంతాలకు అధికారులు పేర్కొన్నారు. అయితే, చోంగ్‌కింగ్‌ పరిధిలోని 41 ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిస్తున్నట్లు స్థానికులు తెలియజేశారు. తుఫాన్ కారణంగా పలు ప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. వాన్‌ఝోవూలో రికార్డు స్థాయిలో వర్షం కురవడంతో అత్యధికంగా 227 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. వాన్‌ఝోవూ విపత్తు నియంత్రణ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం 300 హెక్టార్లలోని పంటపొలాలు నీట మునిగినట్లు వెల్లడించారు. ఇ‍ళ్లు నీట మునగడంతో వందల మంది ప్రజలు నిరాశ్రయులుగా మారారు. వరదల్లో చిక్కుకున్న 1,700 మందిని రెస్క్యూ టీమ్స్ కాపాడి, సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు స్థానిక మీడియా పేర్కొంది.

Read Also: Lip Stick Side Effects : లిప్ స్టిక్ ను వాడుతున్నారా? ప్రాణాలు పోయినట్లే..

Show comments