LVM3 Rocket: 36 ఉపగ్రహాలతో నింగిలోకి ఎగిరేందుకు ఎల్వీఎం3 సిద్ధం

Lvm3 Rocket

Lvm3 Rocket

LVM3 Rocket: అత్యంత బరువైన రాకెట్ ఎల్వీఎం3 నింగిలోకి దూసుకెళ్లనుంది. అక్టోబర్‌ 23న ఇస్రో ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్‌ సెంటర్‌ నుంచి ఈ రాకెట్‌ను ప్రయోగించనుంది. బ్రిటీష్ స్టార్టప్ వన్‌వెబ్‌కు చెందిన 36 ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లనుంది. లాంచ్‌ వెహికల్‌ మార్క్ 3ని(LVM3) గతంలో జీఎస్‌ఎల్వీ మార్క్‌ 3 అని పిలిచేవారు. అక్టోబర్‌ 23న ఉదయం 7గంటలకు ఈ రాకెట్‌ను ప్రయోగించనున్నారు. ఇది ప్రపంచ వాణిజ్య ప్రయోగ సేవా మార్కెట్లోకి లాంచర్ ప్రవేశాన్ని సూచిస్తుంది.

Dudhsagar Falls : దూద్‌సాగర్‌ జలపాతం వద్ద కూలిన వంతెన.. తప్పిన పెనుప్రమాదం

×
×
Ad

క్రయో స్టేజ్, ఎక్విప్‌మెంట్ బే అసెంబ్లింగ్ పూర్తయిందని.. ఉపగ్రహాలను వాహనంలో నిక్షిప్తం చేసి అసెంబుల్ చేశారని, తుది వాహన తనిఖీలు కొనసాగుతున్నాయని ఇస్రో వెల్లడించింది. రాకెట్‌ ఫైనల్‌ చెకింగ్‌ నడుస్తున్నట్లు ఇస్రో వర్గాలు వెల్లడించాయి. సరికొత్త రాకెట్ నాలుగు-టన్నుల తరగతి ఉపగ్రహాలను జియోసింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్ (జీటిఓ)లోకి ప్రవేశపెట్టగలదు. ఎల్వీఎం3 అనేది రెండు సాలిడ్ మోటార్ స్ట్రాప్-ఆన్‌లు, లిక్విడ్ ప్రొపెల్లెంట్ కోర్ స్టేజ్, క్రయోజెనిక్ స్టేజ్‌లతో కూడిన మూడు-దశల వాహనం. భారతదేశానికి చెందిన భారతి ఎంటర్‌ప్రైజెస్ వన్‌వెబ్‌లో ప్రధాన పెట్టుబడిదారు, వాటాదారు.