Site icon NTV Telugu

Himalayas: కరిగిపోతున్న హిమాలయాలు.. ఇస్రో గ్లోబల్ వార్నింగ్..

Himalaya

Himalaya

భూతాపం వల్ల హిమాలయాల్లోని మంచు పర్వతాలు రోజు రోజుకి కరిగి ఏర్పడుతున్న సరస్సులు మరింత విస్తరిస్తున్నాయని ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) వెల్లడించింది. 2016- 17వ సంవత్సరాల్లో గుర్తించిన 2, 431 సరస్సుల్లో 89 శాతం పెద్ద ఎత్తున విస్తరించాయని ఇస్రో నివేదికలో వెల్లడించింది. వీటి పరిమాణం గత 38 ఏళ్లలో రెట్టింపు అయ్యిందని ఇస్రో శాస్త్రవేత్తలు చెప్పుకొచ్చారు.

Read Also: Gita Sabharwal: ఇండోనేషియాలో యూఎన్‌ రెసిడెంట్ కోఆర్డినేటర్‌గా గీతా సబర్వాల్ నియామకం

కాగా, భూమి యొక్క వాతావరణం రోజు రోజుకు వేడెక్కటం వల్లే భౌగోళికంగా మార్పులు సంభవించి హిమనీనదాలు కరిగిపోతున్నాయని పేర్కొనింది. దీని వల్ల కొత్తగా సరస్సులు ఏర్పడటం, ఉన్న సరస్సులు మరింతగా విస్తరించి లోతట్టు ప్రాంతాల్ని వరదలు ముంచెత్తే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. 1984 నుంచి 2023 మధ్య 36.49 నుండి 101.30 హెక్టార్లకు 178 శాతం పెరుగుదలను చూపుతుంది. భారతీయ హిమాలయ నదీ పరివాహక ప్రాంతాలను కవర్‌ చేసే దీర్ఘకాలిక ఉపగ్రహ చిత్రాలు విశ్లేషించిన ఇస్రో విడుదల చేసింది. ఇందులో నదులు, సరస్సుల పరిమాణంలో గణనీయ మార్పులు వచ్చినట్టు వెల్లడించింది.

Exit mobile version