భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో కొత్త తరహా ప్రయోగానికి సిద్ధమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోట నుంచి ఈ రోజు ఉదయం 6 గంటలకు తొలి ప్రైవేట్ రాకెట్ లాంచ్ ప్యాడ్ ద్వారా ప్రైవేట్ రాకెట్ ప్రయోగించనుంది. ఈ నేపథ్యంలోనే కౌంట్ డౌన్ కొనసాగుతోంది. చెన్నైకి చెందిన అగ్నికుల్ కాస్మోస్ ప్రైవేట్ లిమిటెడ్ రూపొందించిన అగ్ని బాన్ రాకెట్ ప్రయోగించనున్నారు. ప్రయోగంలో సెమీ క్రయోజెనిక్ ఆధారిత ఇంజిన్ ను శాస్త్ర వేత్తలు ఉపయోగిస్తున్నారు. వంద కిలోల బరువైన ఉపగ్రహాన్ని లోయర్ ఎర్త్ ఆర్బిట్ లోకి పంపనున్నారు శాస్త్రవేత్తలు. భవిష్యత్తులో చిన్న తరహా ఉపగ్రహాలను లో లోయర్ ఎర్త్ ఆర్బిట్ లో ప్రవేశ పెట్టడానికి దోహదం చేయనుంది ఈ ప్రయోగం. అయితే.. ప్రైవేట్ సంస్థలు రూపొందించిన రాకెట్ ను ప్రయోగించడం ఇది రెండో సారి. గతంలో స్కై రూట్ సంస్థ రూపొందించిన విక్రమ్-1 అనే ప్రైవేట్ రాకెట్ ప్రయోగించిన విషయం తెలిసిందే. అయితే.. ప్రయోగాన్ని ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్..శాస్త్ర వేత్తలు పర్యవేక్షనున్నారు.
Gold Price Today : మహిళలకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన బంగారం ధరలు.. దిగొచ్చిన వెండి ధరలు..
ఈ రాకెట్ ప్రత్యేకత ఏమంటే.. పేటెంట్ పొందిన అగ్నిలెట్ ఇంజిన్ తో దీన్ని నడపటమే. త్రీడీ ప్రింటెడ్ 6 కేఎన్ సెమీ క్రయోజనిక్ ఇంజిన్ సాయంతో దీన్ని ప్రయోగించారు. అగ్నికుల్ రాకెట్ 18 మీటర్ల ఎత్తు ఉండగా.. 1.3 మీటర్ల వెడల్పు ఉంది. ప్రయోగ సమయంలో దీని బరువు 14వేల కేజీలుగా ఉంటుంది. ఈ అగ్నిలెట్ ఇంజిన్లలో లిక్విడ్ ఆక్సిజన్.. లిక్విడ్ ఆక్సిడైజర్ అనే ఇంధనం సాయంతో మూడు దశల్లో రాకెట్ ప్రయోగాన్ని నిర్వహించారు. గత ఏడాది ఆగస్టు 15న ఈ సంస్థ ఒక ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేయగా.. తాజాగా మరోసారి ప్రయోగాన్ని చేపట్టింది.