NTV Telugu Site icon

Israel Military: ఇజ్రాయిల్ దిద్దుబాటు చర్యలు.. కీలక ఆఫీసర్లు ఔట్

Pm

Pm

గత కొద్ది రోజులుగా గాజాపై ఇజ్రాయిల్ యుద్ధం సాగిస్తోంది. ఇప్పటికే వేలాది భవనాలు నేలమట్టం అయ్యాయి. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా యుద్ధం కొనసాగుతోంది. అయితే తాజాగా గాజాలో సహాయక సిబ్బందిపై డ్రోన్ దాడులకు తెగపడడంపై ఇజ్రాయిల్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు అధికారులను ఇజ్రాయెల్ సైన్యం తొలగించింది.

ఇది కూడా చదవండి: Rebel OTT: సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన మమితాబైజు మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

గాజాలో జరిగిన ఇజ్రాయిల్ డ్రోన్ దాడిలో ఏడుగురు ఎన్జీవో సిబ్బంది మృతిచెందారు. దీనిపై ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఇజ్రాయిల్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇద్దరు ఆఫీసర్లను తొలగించింది. మ‌రో ముగ్గురు అధికారుల్ని నిల‌దీసింది. కీల‌క‌మైన స‌మాచారాన్ని ఇజ్రాయిల్ సైనిక ద‌ళాలు త‌ప్పుగా వాడుకున్నాయ‌ని, ఆర్మీ రూల్స్‌ను వాళ్లు ఉల్లంఘించిన‌ట్లు మిలిట‌రీ పేర్కొంది. హ‌మాస్ ద‌ళాన్ని టార్గెట్ చేస్తున్నట్లు అంత‌ర్గతంగా అంచ‌నా వేయ‌డం వ‌ల్ల ఆ ఘ‌ట‌న జ‌రిగింద‌ని మిలిట‌రీ తెలిపింది. ఇజ్రాయిల్ జ‌రిపిన దాడిలో వ‌ర‌ల్డ్ సెంట్రల్ కిచ‌న్ సంస్థకు చెందిన సిబ్బంది మృతిచెందారు. తీవ్రమైన త‌ప్పిదం కారణంగానే ఈ మ‌ర‌ణాలు సంభ‌వించిన‌ట్లు ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్ వెల్లడించింది. డ్రోన్ అటాక్ ప‌ట్ల వ్యక్తిగ‌త విచార‌ణ చేప‌ట్టాల‌ని ఓ సంస్థ డిమాండ్ చేసింది.

ఇది కూడా చదవండి: Kakarla Suresh: ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. ఉదయగిరిని అభివృద్ది చేసి చూపిస్తా..!

యుద్ధంతో అతలాకుతలమవుతున్న గాజాలో మానవతా సాయాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఇజ్రాయెల్‌ తెలిపింది. అందులో భాగంగా ఉత్తర గాజాలో కీలకమైన ఎరెజ్‌ సరిహద్దును తిరిగి తెరుస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో చర్చలు జరిగిన కొద్ది గంటల వ్యవధిలోనే ఈ నిర్ణయం వెలువడటం గమనార్హం.

ఇది కూడా చదవండి: Suryakumar Yadav: ముంబై జట్టులోకి సూర్య భాయ్ ఎంట్రీ.. ప్రత్యర్థులకు దబిడిదిబిడే..