Site icon NTV Telugu

Israel: వైద్యుల వేషధారణలో ఆస్పత్రిలోకి చొరబడి.. మిలిటెంట్లను హతమార్చిన దళాలు

Israel Hamas War

Israel Hamas War

Israel: గాజాలో కొనసాగుతున్న ఇజ్రాయెల్-హమాస్ వివాదం మధ్య ఇజ్రాయెల్ దళాల తాజా వ్యూహాలు బయటపడ్డాయి. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ రహస్య కార్యాచరణ ప్రణాళికలో భాగంగా.. దాని దళాలు పౌరులు, వైద్య సిబ్బంది వేషధారణలో ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలోని ఆసుపత్రిలోకి చొరబడి ముగ్గురు హమాస్ మిలిటెంట్లను హతమార్చారు. దాడి జరిగిన సమయంలో హమాస్‌ గ్రూపునకు చెందిన టార్గెటెడ్‌ ఉగ్రవాదులు నిద్రలో ఉన్నారని సమాచారం. జెనిన్ వెస్ట్ బ్యాంక్ నగరంలోని ఇబ్న్ సినా ఆసుపత్రిలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఆసుపత్రి లోపల ఇజ్రాయెల్ దళాలు జరిపిన ఆకస్మిక దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేయబడింది.

Read Also: Maldives: మోడీకి క్షమాపణ చెప్పండి.. మాల్దీవుల అధ్యక్షుడికి సూచించిన..!

ట్విట్టర్‌లో వైరల్‌ అయిన వీడియోలో అనేక మంది సాయుధ ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్ కమాండోలు.. వైద్యులు, నర్సులు, హిజాబ్‌లు ధరించిన మహిళల వలె మారువేషంలో ఉన్నారు. వారు ఆసుపత్రిలోకి ప్రవేశించి ముగ్గురు మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపారు. ఆస్పత్రిలోని మూడో ఫ్లోర్‌లో మిలిటెంట్లు ఉన్నారని నిర్ధారించుకుని అక్కడికి చేరుకుని ముగ్గురిని మట్టుబెట్టారు. కేవలం 10 నిమిషాల్లోనే ఆపరేషన్‌ పూర్తి అయినట్లు ఇజ్రాయెల్ పేర్కొంది. ఇజ్రాయెల్ కమాండోలు ఆసుపత్రి సిబ్బంది వలె దుస్తులు ధరించారు. సర్జికల్ మాస్క్‌లో ఒకరు ఒక చేతిలో రైఫిల్, మరొక చేతిలో ముడుచుకున్న వీల్‌చైర్‌ను ధరించారు. మరొక వీడియోలో ఇజ్రాయెల్‌ కమాండోలు తన చేతులను పైకి లేపి గోడకు మోకరిల్లిన వ్యక్తిని కొట్టడం చూపిస్తుంది.

Read Also: MPs Suspension: బడ్జెట్‌కు ముందు కేంద్రం కీలక నిర్ణయం.. విపక్ష ఎంపీల సస్పెన్షన్‌ రద్దు

వీడియో బయటకు వచ్చిన వెంటనే ఇజ్రాయెల్‌ డిఫెన్స్ ఫోర్సెస్ స్పందించింది. మృతుల్లోని హమాస్‌ మిలిటెంట్‌ మహమ్మద్‌ జలమ్నెహ్‌ ఇటీవల కొంతకాలంగా ఈ ఆసుపత్రిని వేదికగా చేసుకొని ఉగ్ర కార్యకలాపాలు చేస్తున్నట్లు ఇజ్రాయెల్‌ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్‌) పేర్కొంది. అతడి ఇద్దరు సోదరులు కూడా ఈ ఆపరేషన్‌లో మరణించినట్లు పేర్కొంది. వీరు కూడా పలు దాడుల్లో నిందితులని తెలిపింది. వీరు ముగ్గురూ కలిసి అక్టోబర్‌ 7 తరహా దాడులకు కుట్ర పన్నుతున్నట్లు ఐడీఎఫ్‌ తెలిపింది. ఘజావి సోదరులను ఇస్లామిక్ జిహాద్ మిలిటెంట్ గ్రూప్ యోధులుగా పేర్కొంది, అయితే హమాస్ తన సాయుధ విభాగంలో కమాండర్ జలమ్నెహ్‌ అని పేర్కొంది. ఒక ఇజ్రాయెల్ మంత్రి రహస్య ఆపరేషన్‌పై ప్రశంసలు కురిపించారు. హమాస్, ఇస్లామిక్ జిహాద్‌తో సంబంధం ఉన్న ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చినట్లు IDF పేర్కొంది.

Exit mobile version