ఇజ్రాయెల్ మరో దండయాత్రకు సిద్ధమైంది. ఈసారి భారీ టార్గెట్ ఫిక్స్‌చేసుకుంది. రఫా లక్ష్యంగా భారీ దాడులకు సిద్ధమవుతోంది. కాల్పుల విరమణ చర్చలు విఫలమైన నేపథ్యంలో రఫాపై ఐడీఎఫ్ దండయాత్ర మొదలు పెట్టినట్లు స్థానికులు వెల్లడించారు. సుమారు లక్ష మంది పాలస్తీనా వాసులు రఫా నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ ఆదేశించింది. వార్నింగ్ జారీ చేసిన కొన్ని గంటల్లోనే ఇజ్రాయెల్ దళాలు దాడులు ప్రారంభించింది.
ఇది కూడా చదవండి: Director: పరిశ్రమలో విషాదం.. ప్రముఖ దర్శకుడు మృతి
రఫాలో హమాస్‌కు పట్టున్నట్లు ఇజ్రాయెల్ భావిస్తోంది. వారి అంతమే లక్ష్యంగా తమ దాడులు ఉంటాయని హెచ్చరిస్తున్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ.. సంధి ఒప్పందం కుదిరినా, కుదరకపోయినా రఫాపై తమ దండయాత్ర ఆగదని తేల్చి చెప్పారు. ఈ క్రమంలోనే ఈజిప్టులోని కైరోలో తాజాగా జరిపిన కీలక చర్చలు విఫలమయ్యాయనే వార్తలు వచ్చాయి. గాజా నుంచి ఇజ్రాయెల్ బలగాల ఉపసంహరణ, యుద్ధం ముగింపులాంటి హమాస్ కీలక డిమాండ్లను నెతన్యాహు సర్కారు తిరస్కరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రఫాతో పాటు గాజాలోని ఇతర ప్రాంతాల్లో భారీ దాడులు చేపడతామని చెప్పిన ఇజ్రాయెల్.. పాలస్తీనీయన్లు తరలిపోతున్న సమయంలోనే దాడులు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: CM Jagan: సీఎం జగన్ రేపటి ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇదే..
రఫాపై ఇజ్రాయెల్ భారీ రాకెట్ దాడులకు చేసేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. మునుపటి కంటే ఎక్కువగా దాడులు చేయాలని చూస్తోంది. ఇప్పటికే గాజాను సర్వనాశనం చేసింది. ఇప్పుడు అంతకంటే ఎక్కువగా రఫాపై దాడి చేయాలని చూస్తోంది. ఈ దాడులకు అమెరికా మద్దతు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.