Roman Gofman: ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన నిఘా సంస్థ మొసాద్‌కు కొత్త అధిపతి వచ్చారు. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు నవంబర్ 4న తన సైనిక కార్యదర్శిని ఆ దేశ నిఘా సంస్థ మొసాద్ తదుపరి అధిపతిగా ఎంపిక చేశారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ కొత్త అధిపతి ఎప్పుడూ నిఘా విభాగంలో లేరు, ఆయనకు ఎలాంటి నిఘా నేపథ్యం కూడా లేదు. మొసాద్ కొత్త అధిపతి పేరు మేజర్ జనరల్ రోమన్ గోఫ్‌మన్. గూఢచారి సంస్థ అధిపతిగా గోఫ్‌మన్‌ను నియమించాలనే నిర్ణయాన్ని నెతన్యాహు కార్యాలయం ప్రకటించింది. ప్రస్తుత మొసాద్ చీఫ్ డేవిడ్ బార్నియా స్థానంలో ఆయనను నియమిస్తారని వెల్లడించారు. డేవిడ్ బార్నియా ఐదేళ్ల పదవీకాలం జూన్ 2026లో ముగుస్తుంది. విశేషమేమిటంటే మొసాద్ చీఫ్‌గా గోఫ్‌మన్ పేరు ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఇజ్రాయెల్ సైన్యం దక్షిణ లెబనాన్‌లోని హిజ్బుల్లా ఆయుధ నిల్వ స్థావరాలపై దాడి చేసింది.
READ ALSO: PM Modi: ఇండిగో సంక్షోభంపై ప్రధాని మోడీ సమీక్ష..
ఇంతకీ గోఫ్‌మన్ ఎవరు..
గోఫ్‌మన్ 1976లో బెలారస్‌లో జన్మించాడు. ఆయన తన 14 సంవత్సరాల వయస్సులో ఇజ్రాయెల్‌కు వెళ్లాడు. అనంతరం ఆయన 1995లో ఇజ్రాయోల్ సైన్యం యొక్క ఆర్మర్డ్ కార్ప్స్‌లో చేరి సుదీర్ఘ కాలంగా సైనిక జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అక్టోబర్ 7, 2023న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి ప్రారంభమైనప్పుడు, గోఫ్‌మన్ ఇజ్రాయెల్ జాతీయ పదాతిదళ శిక్షణా కేంద్రానికి కమాండర్‌గా ఉన్నారు. ఆ సమయంలో గాజా సరిహద్దుకు సమీపంలోని దక్షిణ ఇజ్రాయెల్ నగరమైన స్డెరోట్‌లో హమాస్ ఉగ్రవాదులతో జరిగిన ఘర్షణలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఆయన గాయాల నుంచి కోలుకున్న తరువాత ఏప్రిల్ 2024లో నెతన్యాహు మంత్రివర్గంలో చేరారు. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే నెతన్యాహు గతంలో ఇజ్రాయెల్ మత జియోనిస్ట్ ఉద్యమ సభ్యుడు డేవిడ్‌ను దేశీయ భద్రతా సంస్థకు అధిపతిగా నియమించారు. ఇప్పుడు నెతన్యాహు మరోసారి కూడా తన జాతీయవాద అభిప్రాయాలకు దగ్గరగా ఉన్న వ్యక్తినే ఇజ్రాయెల్ యొక్క అతిపెద్ద నిఘా సంస్థకు అధిపతిగా నియమించారు.
READ ALSO: Aryan Khan FIR: బాలీవుడ్ స్టార్ కుమారుడిపై కేసు.. ఇండస్ట్రీని షాక్‌కి గురిచేసిన సంఘటన..
