Site icon NTV Telugu

Israel: ఇజ్రాయెల్ కీలక ప్రకటన.. లక్షద్వీప్ వెళ్లొచ్చంటూ పోస్టు

Lakshadweep

Lakshadweep

ఇజ్రాయెల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియాలోని లక్షద్వీప్ సహా పలు బీచ్‌లకు వెళ్లొచ్చంటూ ఇజ్రాయెల్ తన ప్రజలకు సూచించింది. ఇటీవల గాజాలోని పాలస్తీనియులకు మద్దతుగా మాల్దీవులు కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్ పౌరులు తమ దేశంలో పర్యటించకుండా నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్.. తమ పౌరులు భారత్‌లో పర్యటించాలని సూచించింది. ఈ మేరకు ఇండియాలోని పర్యాటక ప్రాంతాలతో కూడిన ఫొటోలను ఇజ్రాయెల్ ఎంబసీ ఎక్స్‌‌లో పోస్టు చేసింది.

ఇజ్రాయెల్‌ పర్యటకులపై మాల్దీవులు నిషేధం విధించిన వేళ.. భారత్‌లోని కొన్ని బీచ్‌ల్లో మీకు ఆత్మీయ స్వాగతం లభిస్తుందని.. అద్భుతమైన ఆతిథ్యం ఉంటుందని పేర్కొంది. దౌత్యవేత్తలు చేసిన పర్యటనల ఆధారంగా వివరాలు అందిస్తున్నాంటూ ఇజ్రాయెల్ తెలిపింది. ఈ మేరకు లక్షద్వీప్‌, గోవా, అండమాన్ అండ్‌ నికోబార్ దీవులు, కేరళలోని బీచ్‌ల ఫొటోలను షేర్ చేసింది.

ప్రతి సంవత్సరం 10 లక్షల మంది పర్యటకులు మాల్దీవులను సందర్శిస్తారు. ఇందులో 15 వేల మంది ఇజ్రాయెల్‌ పర్యటకులు ఉంటారు. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది ప్రారంభంలో లక్షద్వీప్‌ ను సందర్శించిన ప్రధాని నరేంద్ర మోడీ.. సాహసాలు చేయాలనుకున్నవారు ఇక్కడికి రావాలని పిలుపునిచ్చారు. దీనిపై మాల్దీవుల మంత్రులు అక్కసు వెళ్లగక్కారు. ఈ తర్వాత రెండు దేశాల మధ్య దౌత్యపరమైన సమస్యలు తలెత్తాయి. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్.. భారత్ పర్యటన పట్ల కీలక నిర్ణయం తీసుకుంది.

Exit mobile version