NTV Telugu Site icon

Israel-Lebanon: హిజ్బుల్లాపై ఇజ్రాయెల్ విధ్వంసం.. కమాండర్ మొహమ్మద్ హుస్సేన్ హతం..!

Israelwar

Israelwar

ఇజ్రాయిల్ లెబనాన్‌పై విరుచుకుపడుతోంది. హిజ్బుల్లా మిలింటెట్లు , వారి స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తోంది. గత వారం నుంచి వైమానిక దాడులతో హిజ్బుల్లాపై విరుచుకుపడుతోంది. ఇప్పటికే దక్షిణ లెబనాన్‌లోని 2000కు పైగా హిజ్బుల్లా లక్ష్యాలపై దాడి చేసినట్లు ఇజ్రాయిల్ పేర్కొంది. కాగా.. గురువారం లెబనాన్ రాజధాని బీరుట్ శివార్లలోని అపార్ట్‌మెంట్‌పై వైమానిక దాడిలో హిజ్బుల్లా డ్రోన్ కమాండర్‌ మొహమ్మద్ హుస్సేన్ సురూర్ ను చంపినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. అయితే.. కమాండర్ చనిపోయాడా లేదా అనే దానిపై హిజ్బుల్లా స్పందించలేదు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఇంటెలిజెన్స్ ఆధారంగా ఐడిఎఫ్ బీరూట్‌లో హిజ్బుల్లా ఉగ్రవాది ముహమ్మద్ హుస్సేన్ సరూర్‌పై దాడి చేసి హతమార్చింది.

Read Also: Bangladesh: షేక్ హసీనా సర్కార్ పతనంపై తాత్కాలిక అధ్యక్షుడు యూనస్ సంచలన వ్యాఖ్యలు

మహమ్మద్ హుస్సేన్ సరూర్ ఎవరు..?
హిజ్బుల్లా డ్రోన్ కమాండర్ దాక్కున్న బీరుట్‌లోని దహియాలో బహుళ అంతస్తుల భవనంపై ఈ దాడులు జరిగాయని ఇజ్రాయెల్ తెలిపింది. UAVలు, పేలుడు పరికరాలను ఉపయోగించి ఇజ్రాయెల్ పౌరులు.. IDF సైనికులపై అనేక తీవ్రవాద దాడులకు పాల్పడింది. హిజ్బుల్లాలో సరూర్ దీర్ఘకాల సభ్యుడు అని IDF తెలిపింది. మరోవైపు..ఐక్యరాజ్యసమితి సాధారణ సభ కోసం న్యూయార్క్‌కు వెళ్లే సమయంలో ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హత్య ఆపరేషన్‌కు ఆమోదం తెలిపారని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది.

Read Also: Devara: అందరి ఎదురుచూపులు అందుకే!

మరోవైపు, బీరూట్‌లోని దక్షిణ శివారు ప్రాంతమైన దహియాలోని భవనంపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు గురువారం మధ్యాహ్నం జరిపిన దాడిలో కనీసం ఇద్దరు వ్యక్తులు మరణించారు. 15 మంది గాయపడ్డారని లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గాయపడిన వారిలో ఒక మహిళ కూడా ఉంది.. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. CNN ప్రకారం.. ఈ ప్రాంతం హిజ్బుల్లా బలమైన ఉనికితో జనసాంద్రత కలిగిన ప్రాంతం.

Show comments