NTV Telugu Site icon

Israel Attacks On Lebanon: లెబనాన్‌లో ఉద్రిక్తత.. భారత పౌరులు వెంటనే లెబనాన్ వదిలి వెళ్లాలంటూ.!

Israel Attacks On Lebanon

Israel Attacks On Lebanon

Israel Attacks On Lebanon: లెబనాన్‌లో ప్రస్తుతం పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇటీవల వైమానిక దాడులు, కమ్యూనికేషన్ పరికరాల్లో పేలుళ్ల కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి పరిస్థితుల్లో భారతప్రజల ఆందోళన కూడా పెరిగింది. ఈ సంఘటనల తరువాత, బీరూట్‌ లోని భారత రాయబార కార్యాలయం తదుపరి నోటీసు వచ్చే వరకు లెబనాన్‌కు వెళ్లకుండా సలహాలను జారీ చేసింది. అంతేకాదు, ఎవరైనా భారత పౌరులు ఉంటే వెంటనే లెబనాన్ వదిలి వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. రాయబార కార్యాలయం తన నోటీసులో, ఆగస్టు 1, 2024న జారీ చేసిన సలహాను పునరుద్ఘాటిస్తున్నందున అలాగే ఈ ప్రాంతంలో ఇటీవలి సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని, తదుపరి నోటీసు వచ్చే వరకు భారత పౌరులు లెబనాన్‌కు వెళ్లవద్దని సూచించబడింది. లెబనాన్‌లో నివసిస్తున్న భారతీయ పౌరులు వీలైనంత త్వరగా దేశం విడిచి వెళ్లాలని సూచించారు. ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని, అలాగే రాయబార కార్యాలయంతో సన్నిహితంగా ఉండాలని సూచించారు.

Bank Locker: బ్యాంక్ లాకర్‌ను తెరవాలనుకుంటున్నారా.? అయితే ఈ నియమాలు తెలుసుకోవాల్సిందే!

అందిన నివేదిక ప్రకారం, లెబనాన్‌పై ఇజ్రాయెల్ ఇటీవల జరిపిన సైనిక దాడుల్లో కనీసం 558 మంది మరణించినట్లు సెప్టెంబర్ 24న లెబనీస్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. IDF దాడుల వల్ల మరణించిన 558 మందిలో 50 మంది చిన్నారులు, 1,835 మంది గాయపడ్డారని లెబనీస్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. భారతదేశంతో పాటు, ఇంగ్లాండ్ కూడా తన పౌరులకు కూడా సలహా ఇచ్చింది. లెబనాన్‌ను విడిచిపెట్టాల్సిందిగా బ్రిటిష్ పౌరులను ప్రధాని కైర్ స్టార్మర్ కోరారు. అత్యవసర తరలింపు అవసరమైతే దాదాపు 700 మంది బ్రిటిష్ సైనికులను సైప్రస్‌కు మోహరించారు.

Gold Limit in Home: ఇంట్లో ఎంత బంగారాన్ని ఉంచుకో వచ్చో తెలుసా? నియమాలు ఏం చెబుతున్నాయంటే..?

ఇజ్రాయెల్ లెబనాన్‌లోని హిజ్బుల్లా లక్ష్యాలపై దాడి చేయడం కొనసాగించింది. అయితే ఇరాన్ మద్దతు గల మిలిటెంట్ గ్రూప్ హైఫా, నహరియా, గెలీలీ, జెజ్రీల్ లోయపై వరుస రాకెట్‌లను కాల్చింది. క్షిపణి లాంచర్లు, కమాండ్ పోస్టులు, పౌరుల ఇళ్లలో ఉన్న ఇతర తీవ్రవాద మౌలిక సదుపాయాలతో సహా దక్షిణ లెబనాన్ ఇంకా బెకా వ్యాలీలో 1,600 కంటే ఎక్కువ లక్ష్యాలను వైమానిక దళం ఛేదించిందని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ తెలిపింది.