Site icon NTV Telugu

Ghalib al-Rahwi: ఇజ్రాయెల్ భారీ వైమానిక దాడి.. హౌతి ప్రధాని మృతి?

Ghalib Al Rahwi

Ghalib Al Rahwi

Ghalib al-Rahwi: యెమెన్‌లోని హౌతి తిరుగుబాటు దళాలపై ఇజ్రాయెల్ భారీ ఎయిర్ స్ట్రైక్ జరిపింది. ఈ దాడిలో హౌతి గ్రూప్‌కు చెందిన సైనిక, రాజకీయ ప్రముఖులు మరణించినట్లు సమాచారం. ఇజ్రాయెల్ మీడియా తెలిపిన ప్రకారం.. హౌతి ప్రధానమంత్రి ఘలిబ్ అల్-రహ్వీతో పాటు పలువురు సీనియర్ సైనికాధికారులు మృతి చెందినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ దాడిని ఇజ్రాయెల్ మీడియా ఇప్పటి వరకు జరిగిన అత్యంత పెద్ద ఎయిర్ స్ట్రైక్ అని పేర్కొంది. హౌతి చీఫ్ అబ్దుల్ మాలిక్ హౌతి ప్రసారం చేసిన జాతీయ ప్రసంగాన్ని వీక్షిస్తున్న సమయంలోనే ఈ టాప్ లీడర్లను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ వార్తను మొదటగా హౌతి గ్రూప్‌కు చెందిన అల్ మసీరా టీవీ వెల్లడించగా, అనంతరం ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ మరియు IDF కూడా ఈ దాడిని ధృవీకరించారు. అయితే టార్గెట్ చేసిన వ్యక్తుల గురించి వారు వివరాలు వెల్లడించలేదు.

Pregnancy Tips: గర్భధారణకు గోల్డెన్ డేస్.. ఏ రోజులు ప్రెగ్నెన్సీకి రావడానికి ఎక్కువ అవకాశం?

యెమెన్‌లోని మీడియా సమాచారం ప్రకారం.. హౌతి ప్రధానమంత్రి అల్-రహ్వీ తన సహాయకులతో కలిసి ఒక అపార్ట్‌మెంట్‌లో ఉన్న సమయంలోనే ఈ దాడి జరిగింది. అయితే మరో ఛానల్ సమాచారం ప్రకారం.. హౌతి రక్షణ మంత్రి మొహమ్మద్ నాసర్ అల్-అతిఫీ, చీఫ్ ఆఫ్ స్టాఫ్ మొహమ్మద్ అబ్దుల్ కరీమ్ అల్-ఘమారీ కూడా ఈ దాడిలో మృతి చెందిన అవకాశం ఉందని నివేదించింది. ఇప్పటివరకు ఈ ముగ్గురు హౌతి నాయకుల మరణంపై అధికారిక ప్రకటన రాలేదు. ఇజ్రాయెల్ మీడియా కూడా వారి స్థితి ఇంకా స్పష్టంగా తెలియదని చెబుతోంది. మొత్తంగా యెమెన్ రాజధాని సనాలో సీనియర్ హౌతి నేతలు దాక్కున్న ఇళ్లను ఇజ్రాయెల్ వైమానిక దళం లక్ష్యంగా చేసుకున్నట్లు పేర్కొంది.

Robbery Case: అంతర్జాతీయ క్రికెటర్‌పై చోరీ కేసు, అరెస్ట్.. రెండు ప్రపంచకప్‌లు, 97 మ్యాచ్‌లు!

Exit mobile version