Site icon NTV Telugu

WTC Final 2023: ట్రెడిషనల్ డ్రెస్ లో ఇషాన్ కిషన్ గర్ల్‌ఫ్రెండ్.. ఫోటోలు వైరల్..!

Athidi

Athidi

భారత యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ప్రస్తుతం ఇంగ్లాండ్ లో జరగబోతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ ప్రిపరేషన్ ‌లో ఉండగా అతడి గర్ల్‌ఫ్రెండ్ అదితి హుండియా మాత్రం ఫోటోషూట్స్ తో అభిమానులను పిచ్చెక్కిస్తుంది. మరికొద్దిసేపట్లో ఇంగ్లాండ్ వేదికగా ఆస్ట్రేలియా-ఇండియా మధ్య ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ప్రారంభంకానుంది. అయితే ఈ మెగా ఫైనల్ లో భారత జట్టు వికెట్ కీపర్ గా ఎవరిని ఎంచుకుంటారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. డబ్ల్యూటీసీ ఫైనల్స్ కు గాను టీమిండియా.. ఇషాన్ కిషన్ తో పాటు కేఎస్ భరత్ ను కూడా ఎంపిక చేసింది. అయితే తుది జట్టులో ఎవరికి స్థానం దక్కించుకుంటారనేది సస్పెన్సేగా మారింది.

Read Also: Viral news: కొబ్బరిబొండాలను తాగేవారికి హెచ్చరిక.. ఇది మీ కోసమే..

ఒకవైపు ఇషాన్.. తనకు టీమ్ లో చోటు దక్కుతుందా..? లేదా..? అనే కన్ఫ్యూజన్ లో ఉంటే.. అతడి ప్రియురాలు మాత్రం (అదితి హుండియా) ఫోటో షూట్స్ తో కుర్రాళ్ల మతి పోగొడుతుంది. మోడ్రన్ వేర్స్ తో పాటు సంప్రదాయ డ్రెస్సుల్లో తన అందంతో కాకరేపుతుంది. 2017లో మిస్ ఇండియా రాజస్తాన్ టైటిల్ నెగ్గిన అదితి.. మోడ్రన్ దుస్తులతో పాటు ఎథ్నిక్ వేర్స్ లో కూడా ఎద అందాలు ఆరబోస్తుంది. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన అదితి.. పలు సందర్భాల్లో ఇషాన్ కిషన్ ఆడిన మ్యాచ్ ల్లో దర్శనమిచ్చింది. ఈ ఇద్దరూ కలిసి లంచ్, డిన్నర్ లకు వెళ్లిన ఫోటోలు కూడా గతంలో వైరల్ అయ్యాయి.

Read Also: Shriya Saran : ఆ స్టార్ హీరో తో సినిమాను కావాలనే వదులుకున్న శ్రీయా…?

2017 లో ఫెమినా మిస్ ఇండియా రాజస్తాన్ టైటిల్ తో పాటు ఆమె మిస్ దివా సుప్రానేషనల్ 2018 కూడా గెలిచింది. దీంతో ఆమె పోలండ్ లో జరిగిన మిస్ సుప్రానేషనల్ 2018 ఇంటర్నేషనల్ అందాల పోటీలలో భారత్ తరఫున పాల్గొనింది. మోడ్రన్ డ్రెసెస్ తో పాటు చుడీదార్, గాగ్రా చోళీ లే గాక చీర కట్టినా ఏదో ఒక దగ్గర అదితి తన సొగసులను పంచుతూనే ఉంటుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Exit mobile version