NTV Telugu Site icon

Sukumar : విజయ్ దేవరకొండ తో సుకుమార్ మూవీ లేనట్లేనా..?

Whatsapp Image 2024 03 22 At 2.29.27 Pm (1)

Whatsapp Image 2024 03 22 At 2.29.27 Pm (1)

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్‌ “పుష్ప”మూవీతో పాన్‌ ఇండియా రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు… ఇప్పుడు “పుష్ప2″తో పాన్‌ ఇండియా దాటి గ్లోబల్‌ మార్కెట్‌నే టార్గెట్‌ చేశారు.ఈ మూవీతో ఈ సారి బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ బద్దలు కొట్టాలని నిర్ణయించుకున్నారు. ఆ విధంగానే సినిమాని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది. ఇండిపెండెన్స్ డే సందర్బంగా ఆగస్టు 15 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో సుకుమార్‌ నెక్ట్స్ సినిమా ఎవరితో అనేది ఆసక్తికరంగా మారింది. తాజాగా ఈ విషయం పై క్లారిటీ వచ్చినట్టే అనే చర్చ మొదలైంది.సుకుమార్‌ తన నెక్ట్స్ మూవీ రామ్‌చరణ్‌తో చేయబోతున్నట్లు సమాచారం.. ప్రస్తుతం రామ్ చరణ్‌.. గేమ్‌ ఛేంజర్‌ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. రెండు రోజుల క్రితమే ‘ఆర్‌సీ16’ బుచ్చిబాబు ప్రాజెక్ట్ ని కూడా ప్రారంభించారు. ఈ మూవీ రెగ్యూలర్‌ షూటింగ్‌ని కూడా వెంటనే స్టార్ట్ చేయబోతున్నారు.డేట్స్ అడ్జెస్ట్ చేసుకుని రామ్ చరణ్ ఈ రెండు మూవీస్ షూటింగ్ లలో పాల్గొనబోతున్నారు..

ఇక ఆ తరువాత ఆయన సుకుమార్‌తో ఓ మూవీ చేయబోతున్నారట. ఇప్పటికే వీరి కాంబినేషన్‌లో రంగస్థలం చిత్రం వచ్చి పెద్ద హిట్‌ అయ్యింది. మరోసారి ఈ కాంబినేషన్‌ రాబోతుందని తెలుస్తుంది.. సుకుమార్‌ నెక్ట్స్ మూవీ ఇదే అని అంతా అంటున్నారు. ఆ తర్వాత పుష్ప3 ఉండబోతుందని తెలుస్తుంది. ఇప్పటికే పుష్ప కి మూడో పార్ట్ పై హింట్ ఇచ్చారు. అల్లు అర్జున్‌ పలు ఈవెంట్లలో ఈ విషయాన్ని తెలిపారు. సుకుమార్‌ కూడా తెలిపారు. చాలా పార్ట్ లు తీసేంత కథ ఉందని వారు అన్నారు.. సిరీస్‌లా తీయోచ్చన్నారు. కానీ ‘పుష్ప3’ని మాత్రం రామ్‌చరణ్‌ మూవీ తర్వాత తెరకెక్కిస్తారని తెలుస్తుంది.అయితే సుకుమార్‌ గతంలో విజయ్‌ దేవరకొండతో ఓ సినిమాని ప్రకటించారు. పుష్ప ప్రారంభ సమయంలోనే ఈ మూవీని అనౌన్స్ చేశారు. పుష్ప తర్వాత విజయ్‌తో మూవీ ప్రారంభించాల్సి ఉంది. అయితే ఇది ఆగిపోయిందని మధ్య వార్తలు కూడా వచ్చాయి. అది నిజం కాదని టీమ్‌ స్పందించింది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్‌ అయితే లేదు. పుష్ప`ని ఇంత పెద్ద హిట్‌ అవుతుందని మేకర్స్ కూడా భావించలేదు. అలాగే విజయ్‌ దేవరకొండ `లైగర్‌ తర్వాత పాన్‌ ఇండియా హీరో అయిపోతాడని అంతా అనుకున్నారు. దీనితో సుకుమార్, విజయ్ దేవరకొండ మూవీ ఆగిపోయినట్లే అని ప్రచారం జరుగుతుంది.