Sukumar : విజయ్ దేవరకొండ తో సుకుమార్ మూవీ లేనట్లేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ “పుష్ప”మూవీతో పాన్ ఇండియా రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు… ఇప్పుడు “పుష్ప2″తో పాన్ ఇండియా దాటి గ్లోబల్ మార్కెట్‌నే టార్గెట్ చేశారు.ఈ మూవీతో ఈ సారి బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ బద్దలు కొట్టాలని నిర్ణయించుకున్నారు. ఆ విధంగానే సినిమాని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది. ఇండిపెండెన్స్ డే సందర్బంగా ఆగస్టు 15 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో సుకుమార్ నెక్ట్స్ సినిమా ఎవరితో అనేది ఆసక్తికరంగా మారింది. తాజాగా ఈ విషయం పై క్లారిటీ వచ్చినట్టే అనే చర్చ మొదలైంది.సుకుమార్ తన నెక్ట్స్ మూవీ రామ్‌చరణ్‌తో చేయబోతున్నట్లు సమాచారం.. ప్రస్తుతం రామ్ చరణ్.. గేమ్ ఛేంజర్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. రెండు రోజుల క్రితమే ‘ఆర్‌సీ16’ బుచ్చిబాబు ప్రాజెక్ట్ ని కూడా ప్రారంభించారు. ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్‌ని కూడా వెంటనే స్టార్ట్ చేయబోతున్నారు.డేట్స్ అడ్జెస్ట్ చేసుకుని రామ్ చరణ్ ఈ రెండు మూవీస్ షూటింగ్ లలో పాల్గొనబోతున్నారు..
ఇక ఆ తరువాత ఆయన సుకుమార్‌తో ఓ మూవీ చేయబోతున్నారట. ఇప్పటికే వీరి కాంబినేషన్‌లో రంగస్థలం చిత్రం వచ్చి పెద్ద హిట్ అయ్యింది. మరోసారి ఈ కాంబినేషన్ రాబోతుందని తెలుస్తుంది.. సుకుమార్ నెక్ట్స్ మూవీ ఇదే అని అంతా అంటున్నారు. ఆ తర్వాత పుష్ప3 ఉండబోతుందని తెలుస్తుంది. ఇప్పటికే పుష్ప కి మూడో పార్ట్ పై హింట్ ఇచ్చారు. అల్లు అర్జున్ పలు ఈవెంట్లలో ఈ విషయాన్ని తెలిపారు. సుకుమార్ కూడా తెలిపారు. చాలా పార్ట్ లు తీసేంత కథ ఉందని వారు అన్నారు.. సిరీస్‌లా తీయోచ్చన్నారు. కానీ ‘పుష్ప3’ని మాత్రం రామ్‌చరణ్ మూవీ తర్వాత తెరకెక్కిస్తారని తెలుస్తుంది.అయితే సుకుమార్ గతంలో విజయ్ దేవరకొండతో ఓ సినిమాని ప్రకటించారు. పుష్ప ప్రారంభ సమయంలోనే ఈ మూవీని అనౌన్స్ చేశారు. పుష్ప తర్వాత విజయ్‌తో మూవీ ప్రారంభించాల్సి ఉంది. అయితే ఇది ఆగిపోయిందని మధ్య వార్తలు కూడా వచ్చాయి. అది నిజం కాదని టీమ్ స్పందించింది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్ అయితే లేదు. పుష్ప`ని ఇంత పెద్ద హిట్ అవుతుందని మేకర్స్ కూడా భావించలేదు. అలాగే విజయ్ దేవరకొండ `లైగర్ తర్వాత పాన్ ఇండియా హీరో అయిపోతాడని అంతా అనుకున్నారు. దీనితో సుకుమార్, విజయ్ దేవరకొండ మూవీ ఆగిపోయినట్లే అని ప్రచారం జరుగుతుంది.
Also Read
- India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
- Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
తాజావార్తలు
-
Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
-
Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
-
India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
-
Aishwarya Lekshmi: బన్నీ – అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
-
Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!