NTV Telugu Site icon

Fresh Mutton: మీరు కొంటున్న మటన్‌ తాజాదేనా.?

Fresh Mutoon

Fresh Mutoon

మాంసహార ప్రియులకు ఆదివారం వచ్చిందంటే చాలు చాలమంది నాన్ వెజ్ తెచ్చుకోవడానికి ఇష్టపడుతుంటారు. చికెన్‌ కావాలంటే షాప్‌కి వెళ్తే చాలా వరకు అప్పుడే కట్‌చేసి ఫ్రెష్‌గా ఇస్తుంటారు. కానీ మటన్‌ అలా కాదు. దీంతో మనం కొనే మటన్‌ ఇంతకీ తాజాదేనా..? లేదా.. ఎప్పుడో కట్‌ చేసిన మాంసాన్ని మనకు అమ్ముతున్నారా..? అనే విషయం తెలియక చాలా మంది ఆందోళన పడుతుంటారు. ఈ కారణంతో మటన్‌ కొనడానికి కూడా చాలామంది వెనుకముందు అవుతుంటారు.

Read Also: New Rules: జూన్ 1 నుంచి కొత్త రూల్స్.. ఇవి పూర్తి చేశారా లేదంటే అంతే..!

కానీ అంతగా కంగారు పడాల్సిన అవసరం లేదు.. మీరు కొన్ని టిప్స్ పాటించడం ద్వారా తాజా మటన్‌ను ఈజీగా గుర్తించవచ్చు. మంచి మ‌ట‌న్, చికెన్ తాజాగా క‌నిపిస్తుంది. అయితే ఎప్పుడో క‌ట్ చేసినది అయితే పాలిపోయిన‌ట్టుగా.. ఎండిపోయిన‌ట్టుగా క‌నబడుతుంది. మ‌ట‌న్ తీసుకునేటప్పుడు దాని నుంచి ఎక్కువగా రక్తం లేదా నీరు కారుతున్నట్లు కనిపిస్తే దాన్ని తీసుకోకపోవడమే మంచిది. బాగా ఎరుపు రంగులో ఉంటే అది ముదిరిపోయిన మ‌ట‌న్ అని మీరు అర్థం చేసుకోవాలి.

Read Also: YSR Pension: జూన్ 1న వైఎస్సార్ పెన్షన్ కానుక పంపిణీకి సర్వం సిద్ధం

బాగా ఎరుపుగా ఉన్న మటన్ లో కొవ్వు కూడా ఎక్కువ‌గా ఉంటుంది కాబట్టి అది తీసుకోకపోవడమే మంచిది. గులాబీ, ఎరుపు మ‌ధ్య రంగులో ఉండే మ‌ట‌న్ అయితేనే ఆరోగ్యానికి చాలా మంచిది. చాలా మంది బోన్‌లెస్ మ‌ట‌న్ తినేందుకు ఇష్టపడుతుంటారు. నిజానికి బోన్‌లెస్ క‌న్నా కూడా బోన్ మ‌ట‌న్ బాగా రుచిగా ఉంటుంది. బోన్స్ ఉన్న మ‌ట‌న్‌లో పోష‌కాలు అధికంగా ఉంటాయి. పైగా బొక్కలు ఉన్న మటనే త్వరగా ఉడుకుతుంది. దీని వల్ల మన హెల్త్ కు కూడా మంచిది.