NTV Telugu Site icon

Power : పవర్ చూపిస్తానంటున్న యంగ్ హీరో నితిన్

New Project 2024 11 03t071402.957

New Project 2024 11 03t071402.957

Power : టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ఖాతాలో ఇటీవల కాలంలో హిట్ సినిమాలు లేవని చెప్పాలి. గతంలో ఎక్స్టార్డినరీ మ్యాన్‌ సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా భారీ డిజాస్టర్ అయ్యింది.. దాంతో కాస్త గ్యాప్ తీసుకున్న నితిన్ ఇప్పుడు మరో రెండు కొత్త సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు.. ప్రస్తుతం నితిన్‌ ఆశలన్నీ రాబిన్‌హుడ్‌, తమ్ముడు చిత్రాలపైనే పెట్టుకున్నారు. ఇక రాబిన్‌హుడ్‌ వెంకీకుడుముల దర్శకత్వంలో రూపొందుతుంది. దీంతోపాటు వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో ‘తమ్ముడు’ సినిమాను చేస్తున్నాడు.. తమ్ముడు సినిమా కథ కొత్తగా ఉండబోతుందని పోస్టర్ ను చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు.. ఇటీవల నితిన్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.. ఆ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.. సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.

Read Also:Off The Record : ఉమ్మడి ప్రకాశం జిల్లా వైసీపీలో భారీ మార్పులు జరగబోతున్నాయా? వైసీపీలో దిద్దుబాటు మొదలైందా?

అయితే ఈ సినిమాను కూడా మేకర్స్ మంచి గ్రాండ్ స్కేల్ లోనే తెరకెక్కిస్తుండగా ఈ సినిమా అప్డేట్ సోమవారం వస్తున్నట్లుగా తెలుస్తుంది. నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వారు సినిమా టైటిల్ పెట్టకుండా ఒక ‘పవర్’ఫుల్ అప్డేట్ సోమవారం సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకి వస్తుందన్నట్లుగా తెలిపారు. దీనితో పవన్.. టైటిల్ తో వస్తున్న ఆ “తమ్ముడు” సినిమా అప్డేట్ కోసమే అనుకోవచ్చు. ఒకవేళ “గేమ్ ఛేంజర్” కోసం అయితే సినిమా అఫీషియల్ హ్యాండిల్ నుంచి కూడా ఇది పడి ఉండాలి సో ఇది దాదాపు నితిన్ సినిమా కోసమే అని చెప్పుకోవచ్చు. అంతేకాదు ఈ సినిమాలో ఒక్క ఫైట్ సీన్ కోసమే దాదాపు ఎనిమిది కోట్ల బడ్జెట్ ను పెట్టినట్లు సమాచారం.. అజనీష్‌ లోక్‌నాథ్‌ సంగీతం అందిస్తున్నారు. ఇందులో నితిన్‌కి ఇద్దరు హీరోయిన్లుంటారని తెలుస్తోంది.. త్వరలోనే ఈ సినిమా గురించి మరో అప్డేట్ రాబోతుంది.

Read Also:Telugu Vs Tamil: తమిళ థియేటర్ల విషయంలో టాలీవుడ్ కి అన్యాయం?

Show comments