Site icon NTV Telugu

Bommarillu : అస్సలు ఈ సినిమాకు అలాంటి టైటిల్ పెట్టడానికి కారణం అదేనా..?

Whatsapp Image 2023 07 09 At 10.57.21 Am

Whatsapp Image 2023 07 09 At 10.57.21 Am

ప్రస్తుత పరిస్థితిలో ఒక సినిమా ప్రేక్షకులని బాగా ఆకట్టుకోవాలంటే ఆ సినిమాలో కథ కచ్చితంగా ఉండాలి. ఒక కమర్షియల్ సినిమాకు ఉండాల్సిన అన్నీ హంగులతో పాటు కథ ముఖ్యమని చెప్పాలి. ఆ కథ కు తగ్గ టైటిల్ ను ఎంపిక చేస్తే సినిమాకు ఇంకా హైప్ వచ్చే అవకాశం ఉంటుంది.ఇలా అన్ని కుదిరినప్పుడే సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని మంచి సక్సెస్ సాధిస్తుంటుంది. అందుకే కథ మరియు టైటిల్ విషయంలో కూడా దర్శక నిర్మాతలు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే ఇలా టైటిల్ ఎంపిక చేసే విషయంలో డైరెక్టర్ భాస్కర్ తీరు ఎంతో ఫన్నీగా ఉంటుందని తెలుస్తుంది.. ఈయన సినిమాలకు టైటిల్స్ ఎంపిక చేసే తీరు చాలా భిన్నంగా ఉంటుందటా..ఇక డైరెక్టర్ భాస్కర్ దర్శకత్వంలో సిద్ధార్థ్ మరియు జెనీలియా జంటగా దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం బొమ్మరిల్లు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.అయితే ఈ సినిమాకు బొమ్మరిల్లు టైటిల్ పెట్టడం వెనుక ఒక ఫన్నీ సంఘటన జరిగింది.. అసలు ఈ సినిమాకి బొమ్మరిల్లు అనే టైటిల్ ను ఎందుకు పెట్టారంటే…

బొమ్మరిల్లు సినిమా చిత్రీకరణ జరుగుతున్న సమయంలో ఈ సినిమాకు ఎలాంటి టైటిల్ పెట్టాలని మేకర్స్ ఆలోచిస్తున్న టైం లో వై.వి.ఎస్ చౌదరి నిర్మాత దిల్ రాజుకు ఒక ఇన్విటేషన్ ఇచ్చారనీ సమాచారం.. ఆ ఇన్విటేషన్ డైరెక్టర్ భాస్కర్ కు కనపించిందట.అందులో కార్డుపై బొమ్మరిల్లు అనే పేరును ఆయన చూసారు.. కరెక్ట్ గా అదే విషయాన్ని దిల్ రాజుకి కూడా చెప్పగా దిల్ రాజు కూడా ఎంతో ఇంప్రెస్ అయిపోయి బొమ్మరిల్లు అనే టైటిల్ నే ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది.. అలా ఈ సినిమాకు బొమ్మరిల్లు అనే టైటిల్ ను పెట్టడం జరిగింది.ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ విజయం సాధించడంతో డైరెక్టర్ భాస్కర్ పేరు ముందు బొమ్మరిల్లు చేరి ఆయన పేరు బొమ్మరిల్లు భాస్కర్ గా పిలవబడుతుంది.

Exit mobile version