మీరా జాస్మిన్ ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అద్భుతమైన నటనతో తెలుగు మరియు తమిళ్ చిత్ర పరిశ్రమలలో వరుస సినిమాలలో నటించారు.అమ్మాయి బాగుంది సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ భామ. తొలి సినిమాతోనే తన నటనతో అందరినీ ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.ఆ తర్వాత రవితేజ నటించిన భద్ర సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత గుడుంబా శంకర్, మహారథి మరియు బంగారు బాబు లాంటి సినిమాలలో నటించింది ఈ భామ.. ఇలా తెలుగు, తమిళ్, మలయాళం సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న మీరా జాస్మిన్ 2013లో విడుదలైన మోక్షతో సినిమాలకు దూరం అయింది. మళ్లీ పదేళ్ల తర్వాత సినిమాల్లో తిరిగి రీ ఎంట్రీ ఇచ్చింది.కానీ ఇప్పుడు ఈ భామ సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోంది. తన హాట్ అందాలు ఆరబోస్తూ బాగా ఆకట్టుకుంటుంది ఈ బ్యూటీ. ఈ అమ్మడి హాట్ పోజులు చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.
ప్రతి రోజు సరికొత్త పోజులతో ప్రేక్షకులను బాగా ఆట్టుకుంటుంది మీరా జాస్మిన్..తాజాగా ఆమె విమానం సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా లో ఎయిర్ హోస్టస్ గా ఈ భామ కనిపించింది.ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ మాట్లాడుతూ.. విమానం సినిమా కథ వినగానే నటించడానికి ఒప్పుకున్నాను.ఆ రోజంతా అందులోని క్యారెక్టర్లు మరియు కథ నా మైండ్ లో తిరిగాయి. నేను కథ ఎంచుకున్నానా లేక కథ నన్ను ఎంచుకుందా అని అనిపించింది. అలాగే తను సినిమాలకు గ్యాప్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో కూడా తెలిపింది. హీరోయిన్ గా రాణించినందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది. ఇంకా మెరుగ్గా సినిమాల్లో నటించడానికి కొన్నాళ్ళు గ్యాప్ తీసుకున్నా అని తెలిపింది మీరా జాస్మిన్ . ఇప్పుడు తిరిగి సినిమాల్లో నటిస్తుంటే నాకు కొత్తగా ప్రయాణం మొదలు పెట్టిన ఫీలింగ్ కలుగుతుంది అని చెప్పుకొచ్చింది ఈ భామ ..
