Site icon NTV Telugu

Alluarjun :ఆ కారణం వల్ల భారీ హిట్ ను వదులుకున్న అల్లు అర్జున్..?

Whatsapp Image 2023 06 08 At 3.53.01 Pm

Whatsapp Image 2023 06 08 At 3.53.01 Pm

చాలా మంది హీరో హీరోయిన్స్ కొన్ని కారణాల ద్వారా మంచి సినిమాలను మిస్ అవుతూ ఉంటారు. డేట్స్ కుదరకపోవడమో లేక సినిమా కంటెంట్ అంతగా నచ్చకపోవటం వలన లేక అందులో కొన్ని సీన్స్ కు భయపడో సినిమాను చేయరు.కానీ సీన్ కట్ చేస్తే ఆ సినిమాలే భారీ హిట్స్ అవుతుంటాయి.. అయితే అల్లు అర్జున్ కూడా ఒక సినిమాను ఒక కారణంతో వదిలేసుకున్నాడని సమాచారం . అందులో ఒక సీన్ తను పదే పదే చేయడానికి ఆయన ఇష్టపడక సినిమానే వదులుకున్నాడుప్రస్తుతం అల్లుఅర్జున్ పుష్ప సీక్వెల్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో ఆయన పాన్ ఇండియా స్టార్ గా మారాడు. ఇక మంచి హోదాలో ఉండగానే స్నేహ రెడ్డి అనే అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చాడు. అలా ఒక వైపు ఫ్యామిలీ బాధ్యతలు అలాగే మరోవైపు సినిమాలు చేయటమే కాకుండా.. ఇంకోవైపు బిజినెస్ లు కూడా బాగానే నడిపిస్తున్నాడు. ఇక కొన్ని సినిమాలు కొన్ని కారణాల వల్ల వదులుకున్నాడు. అలా వదులుకున్న సినిమాలు మాత్రం బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచాయి. అయితే గతంలో ఈయనకు ఒక సినిమాలో అవకాశం అయితే వచ్చింది. ఇంతకు ఆ సినిమా ఏదో కాదు విజయ్ దేవరకొండ కు బ్లాక్ బస్టర్ హిట్ అందించిన అర్జున్ రెడ్డి

అయితే డైరెక్టర్ సందీప్ రెడ్డి ముందు ఈ పాత్ర కోసం అల్లు అర్జున్ ని అనుకున్నాడని సమాచారం.. అయితే ఈ సినిమాలో ఎక్కువగా లిప్ లాక్ సీన్స్ ఉండటంతో కచ్చితంగా లిప్ కిస్ ఇవ్వాల్సిందే అంటూ డైరెక్టర్ కండిషన్ పెట్టడంతో వెంటనే అల్లుఅర్జున్ ఇలా పదేపదే కిస్ చేయటం వల్ల తన ఇమేజ్ ఎక్కడ డామేజ్ అయిపోతుందో అని అప్పుడే ఈ సినిమాకు నో చెప్పేసాడని సమాచారం.ఆ తర్వాత శర్వానంద్ దగ్గరికి కూడా వెళ్లి ఈ కథ వినిపించగా ఆ కండిషన్ చెప్పాడట సందీప్ రెడ్డి. ఆయన కూడా అదే కారణంతో నో చెప్పాడని సమాచారం.ఇక చివరిగా విజయ్ దేవరకొండ దగ్గరికి వెళ్ళగా ఆయన ఓకే చెప్పడం భారీ హిట్ కొట్టడం జరిగింది..

Exit mobile version