HaromHara Twitter Review : టాలీవుడ్ హీరో సుధీర్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు .ఎస్ఎంఎస్ సినిమాతో హీరోగా పరిచయం అయిన సుధీర్ బాబు “ప్రేమకథా చిత్రం” సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.ఆ సినిమా ఇచ్చిన జోరుతో సుధీర్ బాబు వరుస సినిమాలు చేసారు.కానీ ఏ సినిమా కూడా ఆ రేంజ్ హిట్ అందుకోలేదు.ప్రతి సినిమాకు సరికొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కూడా సుధీర్ బాబుకు మాత్రం హిట్ అనేది అందని ద్రాక్షలా మిగిలింది.అయితే సుధీర్ బాబు ఈ సారి ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలని భావిస్తున్నాడు. సుధీర్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ “హరోంహర”..జ్ఞాన సాగర్ ద్వారక ఈ సినిమాను గ్రాండ్ గా తెరకెక్కించారు.దర్శకుడు ఈ సినిమాను బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా తెరకెక్కించారు. ఈ సినిమాను సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పి బ్యానర్ పై సుమంత్ నాయుడు గ్రాండ్ గా నిర్మించారు.
Read Also :Kamal Hasan : విశ్వనటుడి లైనప్ లో భారీ సినిమాలు..
ఈ సినిమాలో మాళవిక శర్మ హీరోయిన్ గా నటించింది.ఈ సినిమాలో సునీల్ ,జయ ప్రకాష్ ,అక్షర ,అర్జున్ గౌడ ,లక్కీ లక్ష్మణ్ వంటి తదితరులు కీలక పాత్రలో నటించారు.ఈ సినిమాకు చైతన్ భరద్వాజ్ మ్యూజిక్ అందించారు.ఈ సినిమా నేడు (జూన్ 14 )గ్రాండ్ గా రిలీజ్ అయింది.ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తుంది.ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ రివ్యూ ఇస్తున్నారు.ఈ సినిమాలో సుధీర్ బాబు అద్భుతంగా నటించారని కామెంట్స్ చేస్తున్నారు.ఈ సారి సుధీర్ బాబు మంచి కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారని యాక్షన్ సీన్స్ సినిమాకే హైలైట్ నిలిచినట్లు కామెంట్స్ చేస్తున్నారు.అలాగే ఈ సినిమాలో చైతన్ భరద్వాజ్ మ్యూజిక్ అండ్ బాక్గ్రౌండ్ స్కోర్ స్పెషల్ అసెట్ గా నిలిచిందని ,సినిమాటోగ్రఫీ కూడా అదిరిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు.మొత్తానికి హరోంహర సినిమాతో సుధీర్ బాబు ఈ సారి సాలిడ్ హిట్ అందుకోనున్నట్లు తెలుస్తుంది.
#HaromHara – REVIEW ✅#SudheerBabu Comes up with a Good Project and He Delivers it at his Best 🔥🔥🔥🔥#ChaitanBharadwaj Music is Biggest Asset💥💥💥💥
Action Blocks and Cinematography is too good 👍👍👍
A very good watchable Action Entertainer 💯💯💯 pic.twitter.com/7hjX7x98et
— GetsCinema (@GetsCinema) June 13, 2024