స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుసగా సినిమాలు మరియు సిరీస్ లు అంటూ షూటింగ్స్ తో తెగ బిజీగా ఉంది. తెలుగు మరియు హిందీ భాషల్లోనే కాకుండా తమిళం లో కూడా సమంత సినిమాలు చేస్తుంది.ఒకవైపు సినిమాలు సిరీస్ ల్లో నటిస్తూనే మరో వైపు ముద్దుగుమ్మ సమంత యాడ్ ఫిలిమ్స్ కూడా చేస్తోంది. ఇంత బిజీగా ఉన్న సమంత గురించి పలు ఆసక్తికర విషయాలు మీడియా లో చర్చ అయితే జరుగుతోంది. ముఖ్యంగా ఆమె ఆరోగ్యం గురించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతున్నాయి. ఆ మధ్య సమంత మయో సైటిస్ అనే దీర్ఘకాలిక వ్యాధితో బాధపడ్డ సంగతి తెలిసిందే. ఆ వ్యాధి తో బాధపడుతున్న సమయం లో సమంత కనీసం లేచి నిల్చోలేనంతగా శరీరం మొత్తం విపరీతమైన నొప్పులతో ఇబ్బంది పడిందట. యశోద సినిమా విడుదల సమయంలో ఆమె తన బాధను భరించలేక ఇంటర్వ్యూలోనే కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి పరిస్థితి నుండి సమంత కోలుకుందా అంటే పూర్తిగా కోలుకోలేదు కానీ మునుపటితో పోలిస్తే చాలా బెటర్ అంటూ ఆమె సన్నిహితులు చెప్పుకొచ్చారు..
ముందు ముందు ఆమె ఖచ్చితంగా మరింత ఉత్సాహంగా సినిమాల్లో నటించే అవకాశాలు ఉన్నాయి అంటూ అభిమానులు అనుకుంటున్నారు.. మయోసైటిస్ అనేది దీర్ఘకాలిక వ్యాధి. కనుక దాని నుండి పూర్తి స్థాయిలో ఉపశమనం పొందడం అనేది కాస్త అనుమానమే. కానీ తీవ్ర ప్రభావం లేకుంటే పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు. కనుక సమంత కి ఇక డేంజర్ ఏమీ లేదని ఆమె మునుపటి ఉత్సాహంతో వరుసగా సినిమాలను చేస్తుంది.. చేయబోతోంది అంటూ కొందరు వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సమంత సినిమాల విషయాని కొస్తే విజయ్ దేవరకొండ తో కలిసి ఖుషి సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. మరో వైపు హిందీలో వరుణ్ ధావన్ తో కలిసి సిటాడెల్ అనే వెబ్ సిరీస్ ని కూడా చేస్తోంది. ఇంకా పలు సినిమాలు కూడా సమంత సైన్ చేసింది.. చెన్నై స్టోరీస్ అనే హాలీవుడ్ సినిమా లో కూడా సమంత నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కూడా జరిగింది అంటూ సోషల్ మీడియా లో రూమర్స్ వస్తున్నాయి..