స్టార్ హీరోయిన్ సమంత దాదాపు ఏడాది పాటు సినిమా లకు బ్రేక్ తీసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో తెగ వార్తలు వస్తున్నాయి.. పెద్ద ఎత్తున ఈ విషయమై చర్చ కూడా జరుగుతోంది.సిటాడెల్ సిరీస్ ఇంకా ఖుషి సినిమాల షూటింగ్స్ పూర్తి అయిన తర్వాత మాత్రమే సమంత బ్రేక్ తీసుకుంటుందని కొందరు వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.. ఈ రెండు కూడా గత సంవత్సరమే పూర్తి అవ్వాల్సి ఉంది. కానీ సమంత మయో సైటిస్ అనారోగ్య సమస్యల కారణంగా ఈ షూటింగ్స్ వాయిదా పడుతూ వచ్చాయి.ఖుషి సినిమా షూటింగ్ ను సమంత పూర్తి చేసిందని చిత్ర యూనిట్ సభ్యుల ద్వారా అనధికారికంగా సమాచారం అందుతోంది. ఇదే సమయంలో బాలీవుడ్ లో చేస్తున్న సిటాడెల్ సిరీస్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలు అయ్యిందని వార్తలు వస్తున్నాయి.
సమంత ఖుషి మరియు సిటాడెల్ ప్రమోషన్ లకు హాజరువుతుందా లేదంటే ఆ ప్రమోషన్ కార్యక్రమాలకు దూరంగా వుంటుందా అనే విషయం పై క్లారిటీ రావాల్సి ఉంది.ఆ మధ్య యశోద సినిమా కు కూడా తప్పని పరిస్థితుల్లో సమంత ప్రమోషన్స్ కు వచ్చింది. మరీ ఈ రెండు సినిమాల విషయంలో సమంత ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. సమంత నటించిన ఈ రెండు ప్రాజెక్ట్ లు భారీ విజయాలను సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.సమంత విజయ్ దేవరకొండ నటిస్తున్న ఖుషి సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు వున్నాయి. ఈ సినిమాలో వీరిద్దరి లుక్స్ అలాగే సినిమాలోని సాంగ్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి.కచ్చితంగా ఖుషి సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధిస్తుంది అని అలాగే సిటెడాల్ సిరీస్ కూడా సమంతకు మంచి పేరు తీసుకొస్తుందని అందులో ఆమె యాక్టింగ్ కు అందరూ ఫిదా అవడం ఖాయమని అందరూ అనుకుంటున్నారు.