టాలీవుడ్ హీరో నితిన్ కు ప్రస్తుతం అదృష్టం కలిసి రావడం లేదు.ఏ సినిమా చేసిన కానీ నితిన్ కు నిరాశనే మిగుల్చుతుంది. గతంలో చేసిన భీష్మ మూవీ నితిన్ కెరీర్ లోబిగ్గెస్టు హిట్ గా నిలిచింది. ఆ తరువాత నితిన్ కు ఆ రేంజ్ హిట్ లభించలేదు .నితిన్ ఇటీవల నటించిన మాచర్ల నిజయోజక వర్గం ,ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ వంటి సినిమాలు తీవ్రంగా నిరాశపరిచాయి .. ప్రస్తుతం నితిన్ కెరీర్ చాలా కీలక దశలో ఉంది. నితిన్ ప్రస్తుతం తనకు మార్కెట్ ని కోల్పోకుండా ఉండాలి అంటే తాను తరువాత చేసే సినిమాలు కచ్చితంగా హిట్ అవ్వాల్సిందే. ప్రస్తుతం నితిన్ రెండు క్రేజీ మూవీస్ లో నటిస్తున్నాడు. తనకి భీష్మ వంటి బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ రాబిన్ హుడ్ అనే మూవీలో నటిస్తున్నాడు.అదేవిధంగా వకీల్ సాబ్ డైరెక్టర్ అయిన వేణు శ్రీరామ్ దర్శకత్వంలో “తమ్ముడు”అనే మూవీ చేస్తున్నాడు.
ఈ రెండు సినిమాలపై ప్రేక్షకులలో మంచి అంచనాలు వున్నాయి…ఈ రెండు సినిమాలు మంచి విజయం సాధిస్తేనే నితిన్ కు ప్రస్తుతం వున్న మార్కెట్ స్థిరంగా సాగుతుంది..దీనితో ఈ రెండు సినిమాలపై నితిన్ పూర్తి ఫోకస్ పెట్టినట్లు సమాచారం. అయితే ఈ రెండు సినిమాల బడ్జెట్ విషయమే నితిన్ ప్రస్తుతం వున్న మార్కెట్ కి మించిపోతోంది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ రెండు చిత్రాల బడ్జెట్ కలిపి ఏకంగా 70 కోట్లు వరకు ఉన్నట్లు కామెంట్స్ వినిపిస్తున్నాయి.అంత బడ్జెట్ తిరిగి రాబట్టాలంటే నితిన్ నటిస్తున్న రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలి. లేకుంటే అంత బడ్జెట్ కలెక్ట్ చేయడం కష్టమే అని తెలుస్తుంది. నితిన్ ,వెంకీ కుడుముల కాంబినేషన్ లో వస్తున్న రాబిన్ హుడ్ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలే వున్నాయి..భీష్మ కంటే హిలేరియస్ గా వెంకీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.