NTV Telugu Site icon

Robinhood : “రాబిన్ హుడ్” సినిమా వాయిదా.. ప్రచారంలో నిజమెంత ?

Robinhood V Jpg 1280x720 4g

Robinhood V Jpg 1280x720 4g

Robinhood : హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల కాంబోలో యాక్షన్, కామెడీ జానర్లో రాబిన్‌హుడ్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, క్యారెక్టర్‌ ఇంట్రడక్షన్‌ గ్లింప్స్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ క్రేజీ హై-బడ్జెట్ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. రీసెంట్ గా అడ్వెంచర్ అండ్ హైలీ ఎంటర్ టైనింగ్ టీజర్‌ను రిలీజ్ చేయడంతో మేకర్స్ రియల్ ప్రమోషన్‌లను ప్రారంభించారు. టీజర్ పవర్ ఫుల్ వాయిస్‌ఓవర్‌తో స్టార్ట్ అయింది. నితిన్ హై-ఫై ఇళ్లను లక్ష్యంగా చేసుకుని, అడ్వెంచరస్ దోపిడీలను చేసే మోడరన్ రాబిన్‌హుడ్‌గా పరిచయం అయ్యారు. అతనికి ప్రత్యేకమైన ఎజెండా లేదా నిర్దిష్ట కారణం ఏమీ లేదు, అతని ఏకైక మోటివేషన్ డబ్బు. ఇలాంటి సిట్యువేషన్స్ లో అతను పవర్ ఫుల్ కుటుంబ నేపథ్యం ఉన్న శ్రీలీలని ఇష్టపడతాడు. ఇది ఇప్పటికే డేంజర్ లో వున్న అతని లైఫ్ ని మరింత కాంప్లికేట్ చేస్తుంది. వెంకీ కుడుముల ప్రతి ప్రమోషన్ మెటీరియల్‌లో నెరేటివ్ లో తనదైన మార్క్ చూపిస్తున్నారు.

Read Also:South Korea: దక్షిణ కొరియా అధ్యక్షుడి కార్యాలయంపై దాడి..

నితిన్ నుంచి చాలా కాలం గ్యాప్ తర్వాత వస్తున్న ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. రీసెంట్ గానే ఇష్క్ రీ రిలీజ్ తో మరింత లెవెల్లో రాబిన్ హుడ్ సినిమాకి ప్లస్ చేసుకున్న యూత్ స్టార్ ఇపుడు వెనక్కి వెళుతున్నట్లు బజ్ మొదలైంది. రాబిన్ హుడ్ ఈ డిసెంబర్ లో 20కి రావట్లేదని తాజా సమాచారం. అందుకే ఇపుడు రావాల్సిన సాంగ్ కూడా వాయిదా వేశారని వినిపిస్తుంది. మరి ఈ కొత్త రూమర్స్ పై మాత్రం నితిన్ ఫ్యాన్స్ లాస్ట్ మినిట్ లో టెన్షన్ పడుతున్నారు. మరి మైత్రి మూవీ మేకర్స్ దీనిపై ఏమన్నా క్లారిటీ ఇస్తారేమో చూడాలి. ఇక ఈ చిత్రానికి జివి ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు.

Read Also:Govt Hospital: స్కానింగ్ మాఫియాతో చేతులు కలిపి.. సీల్డ్ కవర్లో డబ్బులు దండుకుంటున్న డాక్టర్లు!

Show comments