Site icon NTV Telugu

Posani Krishna Murali: పోసాని కృష్ణమురళి బయటకు రావడం డౌటే?

Posani Krishna Murali

Posani Krishna Murali

సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళి జైలు నుంచి బయటకు రావడంపై సందిగ్ధం నెలకొంది. కోర్ట్ బెయిల్‌ ఇచ్చినా.. బయటకు రావడం డౌటేనన్న అనుమానాలు నెలకొన్నాయి. పోసానిపై గుంటూరు సీఐడీ పోలీసులు పీటీ వారెంట్‌ వేశారు. ఆయన కోసం గుంటూరు సీఐడీ పోలీసులు కర్నూలు జిల్లా జైలుకు వెళ్లారు. పీటీ వారెంట్‌పై పోసానిని కోర్టు గుంటూరు కోర్టు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. జైలు నుంచే వర్చువల్‌గా జడ్జి ఎదుట పోసానిని ప్రవేశపెట్టనున్నారు.

పోసాని కృష్ణమురళిపై నమోదైన కేసుల్లో ఇప్పటికే బెయిల్‌ లభించింది. ఇప్పటికే పోసానికి ఆదోని కేసులో కర్నూలు కోర్టు మేజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేసింది. పోసాని విడుదల అవుతారని భావించిన సమయంలో పీటీ వారెంట్‌తో గుంటూరు సీఐడీ పోలీసులు వచ్చారు. దీంతో పోసాని విడుదలపై సందిగ్ధత కొనసాగుతోంది. పోసానిని కర్నూలు నుంచి గుంటూరుకు తరలించే అవకాశం ఉందంటున్నారు. పోసానిని వారం రోజులపాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పల్నాడు జిల్లా నరసరావుపేట 2 టౌన్‌ పోలీసులు కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేసేందుకు కోర్టు విచారణను నేటికి వాయిదా వేసింది.

Exit mobile version