పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో వరుస సినిమా లను చేస్తున్నాడు.కానీ ముందు డేట్లు ఇచ్చిన సినిమాల కు మాత్రం పవన్ కళ్యాణ్ న్యాయం చేయడం లేదు అనే విమర్శలు కూడా వస్తున్నాయి.చాలా కాలం క్రితం క్రిష్ దర్శకత్వం లో హరి హర వీరమల్లు సినిమా ను చేయాలి అనుకున్న పవన్ కళ్యాణ్ డేట్లు ఇవ్వడం అయితే జరిగింది. అంతే కాకుండా పవన్ కళ్యాణ్ గతం లో గబ్బర్ సింగ్ సినిమా చేసిన హరీష్ శంకర్ దర్శకత్వం లో ఒక సినిమా ను చేయాలని కూడా భావించారు. మొదట భవదీయుడు భగత్ సింగ్ అనే సినిమా ను ఆయన మొదలు పెట్టారు. కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ను ఉస్తాద్ భగత్ సింగ్ అంటూ పేరును కూడా మార్చడం జరిగింది. ఈ రెండు సినిమా ల షూటింగ్స్ కు సమయం ఎక్కువ ఇవ్వకుండా ఇతర సినిమా ల విషయంలో ఎక్కువ శ్రద్ద పెడుతున్నాడు అంటూ విమర్శలు కూడా వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యి ఇప్పటికే దాదాపు రెండేళ్లు అవుతుంది. కానీ అస్సలు సినిమా షూటింగ్ మాత్రం పూర్తి అవ్వడం లేదు.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం జూన్ నెలలో జరగాల్సిన షెడ్యూల్ ను కూడా క్యాన్స్ చేయడం జరిగిందని తెలుస్తుంది.ఓజీ సినిమా యొక్క షూటింగ్ కోసం జూన్ నెల ను కూడా పవన్ కేటాయించాడు అంటూ వార్తలు కూడా వస్తున్నాయి. జూలై నెలలో బ్రో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ సినిమా కంటే కూడా చాలా ముందు హరి హర వీరమల్లు సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యింది. కానీ ఇప్పటి వరకు షూటింగ్ పూర్తి చేయకుండా చాలా చిరాకు తెప్పిస్తున్నారు అనే విమర్శలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఆకట్టుకునే కథ మరియు కథనం తో దర్శకుడు క్రిష్ ఆ సినిమాను రూపొందిస్తాడు అంటూ అంతా కూడా భావిస్తున్నారు. అంతే కాకుండా పవన్ కళ్యాణ్ మొదటి సారి పీరియాడిక్ డ్రామా నేపథ్యం లో సినిమా ను చేసేందుకు కమిట్ అయ్యాడు. కనుక ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. కానీ వీరమల్లు సినిమా షూటింగ్ మాత్రం ముందుకు సాగడం లేదు.