NTV Telugu Site icon

Late Night Dinner : రాత్రి ఆలస్యంగా తినడం వల్ల కలిగే నష్టాలు..?

Late Night

Late Night

ప్రస్తుతం మారుతున్న జీవనశైలికి అనుగుణంగా ఎన్నో వ్యాధులు చుట్టుముడుతున్నాయి. మానసిక ఆందోళన, అధిక ఒత్తిళ్లు, తినే ఆహారం తదితర కారణాల వల్ల మనషి రోగాల ఊబిలో చిక్కుకుంటున్నాడు. ఇక భోజనం తీసుకోవడంలో కూడా సమయ వేళలు పాటించడం ఎంతో ముఖ్యమని వైద్య నిపుణులు అంటున్నారు. తినే ఆహారం విషయంలో సమయ వేళలు పాటించకపోతే అనారోగ్యం బారిన పడే ఛాన్స్ ఉంటుంది. చాలా మంది తినే ఆహారం విషయంలో సమయ సందర్భాలు పాటించరు.. ముఖ్యంగా రాత్రి సమయాల్లో సరైన ఆహారం తీసుకొని, సరైన నిద్రపోవాలని, లేకపోతే ఒబిసిటి, హృద్రోగ సమస్యలతో బాధపడటం తప్పదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Also Read : First in the World: గర్భంలో శిశువుకు బ్రెయిన్ సర్జరీ.. ప్రపంచంలోనే తొలిసారి..

కాగా, రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేయడం వల్ల వివిధ రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశాలున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. ఎక్కువగా రాత్రిపూట 9 గంటల తర్వాత భోజనం చేసే వారికి క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని కొన్ని పరిశోధనల్లో తేలాయని పరిశోధకులు చెప్పుకొచ్చారు. అందుకే రాత్రి 9 గంటల లోపే భోజనం చేయాలని సూచిస్తున్నారు. అంతేకాదు రాత్రి పూట భోజనం ఆలస్యంగా చేయడం వల్ల డయాబెటిస్‌ -2, గుండె జబ్బులు తప్పవంటున్నారు. అందుకే పడుకునే సమయానికి మూడు గంటల ముందు భోజనం చేయాలని సూచించారు. భోజనం విషయంలో సరైన సమయాలు పాటించాలని, లేకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

Also Read : Muscle Cramps: మీరు నడుస్తుంటే కండరాల్లో నొప్పి వస్తుందా..?

అందుకే రాత్రి సమయంలో భోజనం చేసే ముందు సమయ వేళలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుత కాలంలో ఆలస్యంగా భోజనం చేసే వారు చాలా మంది ఉంటారు. 10 గంటల తర్వాత భోజనం చేసేవారు అధిక సంఖ్యలో ఉంటారు. కొందరేమో రాత్రి 11లకు భోజనం చేస్తుంటారు. అలా కాకుండా నిద్రకు కనీసం మూడు గంటల ముందైనా భోజనం చేస్తే చాలు అని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించే ముందు సంబంధిత నిపుణుల సలహాలను తీసుకోవాల్సిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు Ntvtelugu.com బాధ్యత వహించదు.