Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Is Bollywood Distancing Ar Rahman Music Director Opens Up

AR Rahman: ఈ కారణాలతోనే ఏఆర్ రెహమాన్‌ను బాలీవుడ్ దూరం పెడుతోందా?

Published Date :January 15, 2026 , 7:07 pm
By RAMAKRISHNA KENCHE
AR Rahman: ఈ కారణాలతోనే ఏఆర్ రెహమాన్‌ను బాలీవుడ్ దూరం పెడుతోందా?
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

AR Rahman: ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్‌ ఈ రోజు బాలీవుడ్‌లో అత్యంత విజయవంతమైన మ్యూజిక్ కంపోజర్లలో ఒకరిగా నిలిచారు. హిందీ సినిమా పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకోవడానికి ఆయనకు దాదాపు ఏడేళ్లు పట్టింది. ఈ విషయంపై ఆయన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెహమాన్‌ మాట్లాడుతూ.. మొదట్లో బాలీవుడ్‌లో తను బయటి వాడిలా భావించారని చెప్పారు. ‘రోజా’, ‘బాంబే’, ‘దిల్ సే’ వంటి సూపర్ హిట్ సినిమాలు చేసినప్పటికీ.. హిందీ చిత్రసీమలో భాగమన్న భావన కలగలేదన్నారు. అయితే 1999లో విడుదలైన సుభాష్ ఘై చిత్రం ‘తాల్’ తర్వాతే తన సంగీతం ఉత్తర భారతదేశం అంతటా వ్యాపించి, ప్రజల జీవితాల్లో భాగమైందని చెప్పారు. “తాల్ పాటలు ఇళ్ల వంటగదుల్లో కూడా వినిపించేవి. ఉత్తర భారతదేశం ప్రజల రక్తంలో ఆ సంగీతం కలిసిపోయింది” అని గుర్తు చేసుకున్నారు.

READ MORE: Maruti Suzuki బంపర్ ఆఫర్.. జనవరిలో ఈ కార్లపై రూ. 1.70 లక్షల వరకు భారీ తగ్గింపు.!

Also Read

  • Tamil Nadu: గవర్నర్ పచ్చజెండా.. రేపు మ.3:15కి సీఎంగా విజయ్ ప్రమాణం
  • Tamil Nadu: గవర్నర్‌ను కలిసిన విజయ్.. ఎమ్మెల్యేల మద్దతు లేఖ అందజేత
  • Uttar Pradesh: బీజేపీ "మిషన్ యూపీ 2027" స్టార్ట్ .. యోగీ సర్కార్ కీలక చర్య..
  • Tamil Nadu: గవర్నర్ యూటర్న్.. కేరళం టూర్ రద్దు.. విజయ్‌కు అపాయింట్‌మెంట్
Add as a preferred
source on google

అంతేకాదు.. గత ఎనిమిదేళ్లుగా బాలీవుడ్‌లో తనకు తక్కువ అవకాశాలు రావడంపై రెహమాన్‌ స్పందించారు. భాష లేదా మతం కారణంగా ఆఫర్లు రావడం లేదని పరోక్షంగా తెలిపారు. అయితే తాను మాత్రం బాలీవుడ్‌లో ప్రత్యక్షంగా వివక్షను అనుభవించలేదని చెప్పారు. అయితే తనకు ఆఫర్‌లు రాకపోయినా.. సానుకూలంగా తీసుకుంటానని రెహమాన్‌ అన్నారు. కుటుంబంతో ఎక్కువ సమయం గడపడానికి అవకాశం లభిస్తుందని చెప్పారు. తాను పనుల కోసం ఎవ్వరి వెంటా పడనని.. ఆఫర్లు తనను వెతుక్కుంటూ రావాలని.. అప్పుడే తనకు గౌరవం దక్కుతుందని వెల్లడించారు. ఇదిలా ఉండగా.. ఏఆర్ రెహమాన్‌ బాలీవుడ్‌లో 1991లో మణిరత్నం దర్శకత్వం వహించిన ‘రోజా’తో అడుగుపెట్టారు. ఆ తర్వాత ‘బాంబే’ (1995), ‘దిల్ సే’ (1998) వంటి చిత్రాల్లో సంగీతం అందించారు. అలాగే 1995లో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘రంగీలా’ వంటి విభిన్నమైన చిత్రానికి కూడా సంగీతం అందించారు. అయితే ‘తాల్’ తర్వాతే తాను నిజంగా హిందీ సినిమా పరిశ్రమలో భాగమయ్యాననే భావన కలిగిందని రెహమాన్‌ తెలిపారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • AR Rahman Bollywood news
  • AR Rahman career Bollywood
  • AR Rahman fewer Bollywood films
  • AR Rahman interview
  • AR Rahman latest comments

తాజావార్తలు

  • Hyderabad Traffic Alert: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. రేపు ఈ దారుల్లో వెళ్తే ట్రాఫిక్‌లో చిక్కుకోవాల్సిందే! కంప్లీట్ రూట్ మ్యాప్ ఇదే

  • Kayadu Lohar : ఆగస్టును ఆక్రమించిన అస్సాం భామ

  • Jonna Sangati Recipe : ఆరోగ్యానికి సిరి జొన్న సంగటి.. పాతకాలం నాటి బలమైన ఆహారం తయారీ విధానం ఇదే.!

  • Tamil Nadu: గవర్నర్ పచ్చజెండా.. రేపు మ.3:15కి సీఎంగా విజయ్ ప్రమాణం

  • UFO Files: ఏలియన్ల గుట్టు రట్టు.. చరిత్రలో తొలిసారిగా ‘UFO’ రహస్య పత్రాలను బయటపెట్టిన అమెరికా!

ట్రెండింగ్‌

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions