NTV Telugu Site icon

Telangana Assembly: నేడే తెలంగాణ అసెంబ్లీలో ఇరిగేషన్పై శ్వేతపత్రం విడుదల..

Uttam

Uttam

Irrigation Department: నీటిపారుదల రంగంపై తెలంగాణ అసెంబ్లీలో ఇవాళ శ్వేతపత్రం విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో నిర్మించిన నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాల్లో జరిగిన లోపాలపై సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వనున్నారు. గత ప్రభుత్వం చేసిన అక్రమాలన్నీ వెలుగు చూసేలా శ్వేతపత్రం ఉండాలని రేవంత్ సర్కార్ నిర్ణయించిన నేపథ్యంలో 2014 నుంచి 2023 వరకు చేపట్టిన ప్రాజెక్టులన్నింటిని ప్రధానంగా శ్వేతపత్రంలో పేర్కొననున్నారు.

Read Also: Ap Jobs: పది అర్హతతో ఉద్యోగాలు.. నెలకు జీతం రూ.15 వేలు.. అప్లై చేసుకోండిలా..

అయితే, వాస్తవానికి శుక్రవారం నాడు సాయంత్రమే అసెంబ్లీలో పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వడానికి ఏర్పాట్లు జరిగాయి. సాయంత్రం 5:51 నిమిషాలకు సభ ప్రారంభమైంది.. ఆ వెంటనే ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య లేచి మాట్లాడుతూ.. సభలో సాగునీటిరంగంపై సుధీర్ఘ చర్చ జరగాల్సిన అసవరం ఉంది ఈ నేపథ్యంలో సభను శనివారానికి వాయిదా వేయాలని స్పీకర్‌ను కోరారు. దీన్ని బీఆర్‌ఎస్‌, బీజేపీ సభ్యులు తప్పుబట్టారు.

Read Also: Astrology: ఫిబ్రవరి 17, శనివారం దినఫలాలు

ఇక, తెలంగాణ రాష్ట్ర సాగునీటి రంగంపై శ్వేతపత్రం శుక్రవారం నాడే విడుదల చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. రాత్రి 11 గంటలు అయినా సభలో చర్చిండానికి తాము సిద్దమనీ.. మేము పూర్తిగా సన్నద్ధమై వచ్చామని ఆయన తెలిపారు. దీనికి విప్‌లు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి సహకరించాలన్నారు. అలాగే, బీజేపీ పక్షనేత ఎ.మహేశ్వర్‌రెడ్డి సైతం మాట్లాడుతూ.. శనివారం నాడు ఢిల్లీలో తమ పార్టీ నేషనల్‌ కౌన్సిల్‌ మీటింగ్‌ ఉంది.. ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్యేలు ఢిల్లీకి పోయారు.. కాళేశ్వరం అవినీతిపై సీబీఐతో విచారణ చేయించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Show comments