NTV Telugu Site icon

GWMC : జీవీఎంసీ కార్మికుల నియామకాల్లో అక్రమాలు.. బయటపడ్డ ఆడియోలు

Gwmc

Gwmc

Irregularities in recruitment of GWMC workers

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో కాంట్రాక్ట్ పారిశుద్ద్య కార్మికుల నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆధారంతో సహా కాంగ్రెస్ నేతలు బయటపెట్టారు. పేద కార్మికుల కొట్టకూడదు అధికార పార్టీ నేతలు కాంట్రాక్ట్ కార్మికుల పోస్టులు నమ్ముకున్నారని ఇందులో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో పాటు ప్రజాప్రతినిధులను భారీ ముడుపులు ముట్టాయని ఆడియో టేపులను బయటపెట్టారు. గత ఏడాది జరిగిన నియామకరణ సందర్భంగా జరిగిన ఆడియో టేపుల వాయిస్ బయటకు రావడం కలకలం రేపుతుంది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికుల నియామకల్లో భారీ అక్రమాలు జరగగానే కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి విమర్శించారు. ఏడాది క్రితం చేపట్టిన కాంట్రాక్ట్ కార్మికుల నియామకాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు కార్పొరేషన్ సిబ్బంది భారీ ఎత్తున ముడుపులు తీసుకొని కార్మికుల నియామకాలు చేశారని ఆయన ఆరోపించారు. ఇందుకు సంబంధించిన కొన్ని ఆడియో టేపులు బయటపెట్టారు.

గ్రేటర్ వరంగల్ లోని ప్రజాప్రతినిధుల ఒత్తిడి మేరకు కాసులకు కక్కుర్తి పడ్డ కొందరు ప్రజాప్రతినిధులు అధికారులు అవసరానికి మించి కార్మికుల నియామకాలు చేశారు. దీంతో అదనంగా నియామకమైన కార్మికులను తొలగించే అంశం చర్చకు రావడంతో ఈ కార్మికుల నియామకాల్లో జరిగిన అక్రమాలు వెలుగు చూసాయి. దీంతో అప్పుడు జరిగిన అధికారుల సంభాషణలు కొందరి తొలగించేందుకు జరుగుతున్నటువంటి ఒత్తిడి, అప్పుడు డబ్బులు తీసుకున్న కార్మికులను కాపాడుకునేందుకు ప్రజా ప్రతినిధులు చేస్తున్న ఒత్తిళ్లు అధికారుల సంభాషణ అని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు బయటపెట్టడం కలకలం రేపుతుంది. కార్మికులు సైతం మాకు అన్యాయం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ మీడియా ముందుకు వచ్చారు. లక్షల రూపాయలు డబ్బులు తీసుకుని ఇప్పుడు మీ మీ నియామకాలు చెల్లవంటూ రోడ్డున పడేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని వాపోతున్నారు. గత ఏడాది మున్సిపాలిటీ పరిధిలో కాంట్రాక్టు ఉద్యోగాలు 452ఉండేవి వీరిలో 52మందిని మంచిగా పని చేసిన వారిని తీసివేశారు. 52 మంది కుటుంబాలు డబ్బులు ఇచ్చి మోసపోయారని వారిని ఆదుకోవాలని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. మినిస్టర్స్ కు, ఎమ్మెల్యే లకు, కార్పొరేట్ లకు పర్సెంటేజ్ వైజ్ గా తీసుకున్నారని ఆరోపించారు. ఈ కుంభకోణం పై సీబీఐ విచారణ చేయాలని, కార్మికులకు న్యాయం జరగకపోతే కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగుతాం అని హెచ్చరించారు. గత ఏడాది జరిగిన నియామకాల సందర్భంగా మాట్లాడిన మాటల ఆడియో టేపులు ఇప్పుడు బయటకు రావడం అక్రమాల పుట్టకదులుతుంది.