NTV Telugu Site icon

AFG vs SL: శ్రీలంకపై అఫ్గానిస్తాన్ విజయం.. స్టూడియోలో చిందులేసిన భారత మాజీలు!

Afghanistan Team

Afghanistan Team

Irfan Pathan and Harbhajan Singh Dance Video Goes Viral after AFG bet SL: ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ 2023లో పసికూన అఫ్గానిస్తాన్ మూడో సంచలనం నమోదు చేసింది. ఇప్పటికే డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లండ్‌, మాజీ విన్నర్‌ పాకిస్తాన్‌ జట్లను ఓడించిన అఫ్గాన్‌.. తాజాగా మాజీ వరల్డ్‌ ఛాంపియన్‌ శ్రీలంకకు భారీ షాక్ ఇచ్చింది. పూణేలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 49.3 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌట్ కాగా.. ఆపై అఫ్గాన్‌ 45.2 ఓవర్లలో మూడే వికెట్లు కోల్పోయి ఛేదించింది.

శ్రీలంకను అఫ్గానిస్తాన్ చిత్తు చేసిన అనంతరం భారత మాజీలు ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్ స్టూడియోలో భాంగ్రా డాన్స్ చేశారు. ముందుగా ఇర్ఫాన్ డాన్స్ చేయగా.. ఆపై అతడికి హర్భజన్ జత కలిశాడు. ఇద్దరు కలిసి అఫ్గానిస్తాన్ సంచలన విజయాన్ని ఎంజాయ్ చేశారు. ఇర్ఫాన్, హర్భజన్‌ల డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతకుముందు పాకిస్థాన్‌పై అఫ్గాన్‌ విజయం సాధించిన తర్వాత ఇర్ఫాన్ ఆఫ్ఘనిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌తో కలిసి మైదానంలో డ్యాన్స్ చేసిన విషయం తెలిసిందే.

Also Read: Afghanistan Cricket: అఫ్గానిస్తాన్ నెక్స్ట్‌ టార్గెట్‌ ఆస్ట్రేలియా.. ఓడిస్తే సెమీస్‌కు..!

అఫ్గానిస్తాన్ క్రికెట్‌కు భారత్‌తో అనుబంధం ఉంది. అఫ్గాన్‌ క్రికెట్‌ను మెరుగుపరచడంలో, క్రికెటర్లను తీర్చిదిద్దడంలో భారత్ కీలక పాత్ర పోషించింది. అఫ్గాన్‌ జట్టుకు భారత మాజీ ప్లేయర్ అజయ్ జడేజా మెంటార్‌గా ఉన్నాడు. జడేజా మార్గనిర్ధేశంలో అఫ్గాన్‌ జట్టు సంచలన విజయాలు సాధిస్తోంది. అందుకే ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్ డ్యాన్స్ చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అజయ్ జడేజాను భారత క్రికెట్‌లో గురు జీ అని పిలుస్తుంటారు. ఇక అఫ్గాన్‌ తన తదుపరి మూడు మ్యాచ్‌లలో గెలిస్తే సెమీస్ చేరే అవకాశాలు ఉన్నాయి. నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో అఫ్గానిస్తాన్ తలపడాల్సి ఉంది.

Show comments