Iran: ఇజ్రాయెల్ కి ఇరాన్ వార్నింగ్.. అణుబాంబు తయారీ విధాన మార్పునకు వెనకాడం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇజ్రాయెల్ కి ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. అణుబాంబు తయారీ విషయంలో ఇరాన్ కీలక ప్రకటన చేసింది. సుప్రీం లీడర్ సలహాదారు కమాల్ ఖర్రాజీ మాట్లాడుతూ.. తమ దేశం అవసరమైతే అణువిధానం మార్చుకొనేందుకు ఏ మాత్రం వెనుకాడదన్నారు. ప్రస్తుతం ఉన్న విధానాన్ని అణు విధానాన్ని మార్చేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఇప్పటి వరకు అణుబాంబు తయారీపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని.. కానీ, ఇరాన్ ఉనికి ప్రమాదంలో పడితే మాత్రం మా సైనిక విధానం మార్చుకోవాల్సి ఉంటుందని పునరుద్ఘాటించారు. ఒక వేళ తమ అణుస్థావరాలపై ఇజ్రాయెల్ దాడిచేస్తే ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ హెచ్చరికలు ప్రస్తుతం ఇరు దేశాల మధ్య చర్చనీయాంశాలుగా మారాయి.
READ MORE: Kami Rita Sherpa: తన రికార్డును తానే బద్దలు కొడుతూ.. ఎవరెస్ట్‌ను అత్యధికసార్లు అధిరోహించిన వ్యక్తి..
Also Read
- Lal Darwaza Bonalu: పాతబస్తీలో బోనాల పండుగ శోభ.. అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
- Ravindra Jadeja: ఎట్టకేలకు గంభీర్ ముఖంలో నవ్వులు పూయించిన జడేజా.. ఏం చేశాడో చూడండి (వీడియో)
- Dharmendra Pradhan: ‘జెన్-జెడ్‌ను తప్పుదోవ పట్టించారు’.. తన రాజీనామాపై తొలిసారి స్పందించిన ధర్మేంద్ర ప్రధాన్
- H-1B Visa: H-1B వీసాదారులకు ట్రంప్ సర్కారు షాక్.. ఉద్యోగం పోతే వెంటనే అమెరికా వీడాల్సిందే!
ఇరుదేశాలు సై అంటే సై అనే రీతిలో వ్యవహరిస్తున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఘర్షణ వాతావరణం రోజు రోజుకు తీవ్ర తరమవుతోంది. ఈ వివాదం ముదిరిన వేళ ఇలాంటి హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. ఇటీవల సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ బాంబింగ్ చేయడం దీనికి ప్రధాన కారణంగా నిలిచింది. దీంతో వందల కొద్దీ డ్రోన్లు, క్షిపణులను టెల్‌అవీవ్‌పైకి టెహ్రాన్ ప్రయోగించింది. ఇరాన్‌ను అణు కార్యక్రమానికి దూరం చేసేందుకు ఐఏఈఏ చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదనే చెప్పాలి. ఆ సంస్థ అధిపతి రాఫెల్ గ్రూసీ ఇరాన్‌పై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. చర్చలకు ఆ దేశం ఏ మాత్రం సహకరించడంలేదని వెల్లడించారు. గతేడాది ఇరాన్ బహిర్గతం చేయని ప్రాంతాల్లో యూరేనియం అణువులు దొరికాయి. వాటిపై దర్యాప్తు చేసేందుకు సహకరిస్తానని నాడు ఇరాన్ పేర్కొంది. కానీ, ఆ హామీని నిలబెట్టుకోలేదని ఇజ్రాయెల్పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా అవసరమైతే అణుబాంబు చేస్తామన్నట్లు సుప్రీం లీడర్ సలహాదారు పేర్కొనడం సంచలనం సృష్టిస్తోంది. ఒక వేళ వివాదం తారాస్థాయికి చేరకుంటే ప్రపంచంలోని పలు దేశాలు కూడా నష్టపోయే ప్రమాదం ఉంది.
తాజావార్తలు
-
Lal Darwaza Bonalu: పాతబస్తీలో బోనాల పండుగ శోభ.. అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
-
Bajaj Pulsar: 25 ఏళ్లలో బజాజ్ పల్సర్ ఎంతగా మారింది? 2001 నాటి 150cc నుంచి కొత్త N160 4V వరకు పూర్తి చరిత్ర ఇదే!
-
DC: లోకేష్ కనగరాజ్ ‘డీసీ’లో విజయ్ దేవరకొండను తీసుకోవాలనుకున్నారా? అసలు కథ ఇదే!
-
YouTube Movies : రూపాయి ఖర్చు లేకుండా.. యూట్యూబ్‌లో మైండ్ బ్లాక్ చేసే థ్రిల్లర్స్
-
PhonePe Daily RD: రోజుకు రూ.100తో PhonePe Daily RD.. ఎలా పెట్టుబడి పెట్టాలి? వడ్డీ రేట్లు, పూర్తి వివరాలు
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!