Site icon NTV Telugu

Iran: ఇజ్రాయెల్ కి ఇరాన్ వార్నింగ్.. అణుబాంబు తయారీ విధాన మార్పునకు వెనకాడం

Nilesh Kumbhani (1)

Nilesh Kumbhani (1)

ఇజ్రాయెల్ కి ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. అణుబాంబు తయారీ విషయంలో ఇరాన్‌ కీలక ప్రకటన చేసింది. సుప్రీం లీడర్‌ సలహాదారు కమాల్‌ ఖర్రాజీ మాట్లాడుతూ.. తమ దేశం అవసరమైతే అణువిధానం మార్చుకొనేందుకు ఏ మాత్రం వెనుకాడదన్నారు. ప్రస్తుతం ఉన్న విధానాన్ని అణు విధానాన్ని మార్చేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఇప్పటి వరకు అణుబాంబు తయారీపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని.. కానీ, ఇరాన్‌ ఉనికి ప్రమాదంలో పడితే మాత్రం మా సైనిక విధానం మార్చుకోవాల్సి ఉంటుందని పునరుద్ఘాటించారు. ఒక వేళ తమ అణుస్థావరాలపై ఇజ్రాయెల్‌ దాడిచేస్తే ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ హెచ్చరికలు ప్రస్తుతం ఇరు దేశాల మధ్య చర్చనీయాంశాలుగా మారాయి.

READ MORE: Kami Rita Sherpa: తన రికార్డును తానే బద్దలు కొడుతూ.. ఎవరెస్ట్‌ను అత్యధికసార్లు అధిరోహించిన వ్యక్తి..

ఇరుదేశాలు సై అంటే సై అనే రీతిలో వ్యవహరిస్తున్నాయి. ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య ఘర్షణ వాతావరణం రోజు రోజుకు తీవ్ర తరమవుతోంది. ఈ వివాదం ముదిరిన వేళ ఇలాంటి హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. ఇటీవల సిరియాలోని ఇరాన్‌ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్‌ బాంబింగ్‌ చేయడం దీనికి ప్రధాన కారణంగా నిలిచింది. దీంతో వందల కొద్దీ డ్రోన్లు, క్షిపణులను టెల్‌అవీవ్‌పైకి టెహ్రాన్‌ ప్రయోగించింది. ఇరాన్‌ను అణు కార్యక్రమానికి దూరం చేసేందుకు ఐఏఈఏ చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదనే చెప్పాలి. ఆ సంస్థ అధిపతి రాఫెల్‌ గ్రూసీ ఇరాన్‌పై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. చర్చలకు ఆ దేశం ఏ మాత్రం సహకరించడంలేదని వెల్లడించారు. గతేడాది ఇరాన్‌ బహిర్గతం చేయని ప్రాంతాల్లో యూరేనియం అణువులు దొరికాయి. వాటిపై దర్యాప్తు చేసేందుకు సహకరిస్తానని నాడు ఇరాన్ పేర్కొంది. కానీ, ఆ హామీని నిలబెట్టుకోలేదని ఇజ్రాయెల్పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా అవసరమైతే అణుబాంబు చేస్తామన్నట్లు సుప్రీం లీడర్‌ సలహాదారు పేర్కొనడం సంచలనం సృష్టిస్తోంది. ఒక వేళ వివాదం తారాస్థాయికి చేరకుంటే ప్రపంచంలోని పలు దేశాలు కూడా నష్టపోయే ప్రమాదం ఉంది.

Exit mobile version