NTV Telugu Site icon

Iran: ఇజ్రాయిల్‌పై దాడికి ఆదేశించిన ఇరాన్ సుప్రీం లీడర్.. మధ్యప్రాచ్యంలో యుద్ధమేఘాలు..

Iran

Iran

Iran: హమాస్ పొలిటికల్ చీఫ్ ఇస్మాయిల్ హనియే హత్య తర్వాత ఇరాన్ కోపంతో రగిలిపోతోంది. ఇరాన్ కొత్త అధ్యక్షుడిగా పెజెష్కియాన్ ప్రమాణస్వీకారం కోసం టెహ్రాన్ వచ్చిన హనియేని హత్య చేశారు. అయితే, ఈ హత్యకు ఇజ్రాయిల్ బాధ్యత వహించలేదు. తమ గడ్డపై హమాస్ చీఫ్‌ని హత్య చేయడంపై ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇజ్రాయిల్ ఈ హత్యకు కారణమని ఇరాన్‌తో పాటు హమాస్ కూడా నమ్ముతోంది. దీనికి తప్పకుండా ప్రతీకారం ఉంటుందని హనియే అంత్యక్రియల సందర్భంగా ఇరాన్ ప్రకటించింది.

ఇదిలా ఉంటే, హనియే హత్య తర్వాత ఇజ్రాయిల్‌పై నేరుగా దాడి చేయాలని ఇరాన్ సుప్రీంలీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ ఆదేశించినట్లు న్యూయార్క్ టైమ్స నివేదించింది. హనియే హతమైనట్లు ఇరాన్ ప్రకటించిన కొద్దిసేపటికే, బుధవారం ఉదయం ఇరాన్ యొక్క సుప్రీం జాతీయ భద్రతా మండలి అత్యవసర సమావేశంలో ఖమేనీ ఈ ఆదేశాలు ఇచ్చారు.

Read Also: Adhir Chowdhury: అధిర్ రంజన్ బీజేపీలో చేరవచ్చు.. తృణమూల్ సంచలన వ్యాఖ్యలు..

ఇరాన్ అణుశాస్త్రవేత్తలు, సైనిక కమాండర్లను చంపిన చరిత్ర ఇజ్రాయిల్‌కి ఉంది. ఈ నేపథ్యంలోనే హనియే హత్య కూడా ఇజ్రాయిల్ చేసినట్లు ఇరాన్ అనుమానిస్తోంది. మరోవైపు గాజాలోని హమాస్, లెబనాన్‌‌లోని హిజ్బుల్లాని ఇరాన్ తమకు వ్యతిరేకంగా ప్రాక్సీలుగా ఉపయోగిస్తోందని ఇజ్రాయిల్ చెబుతోంది. ప్రస్తుతం హనియే హత్యతో పాటు కొన్ని గంటల ముందు లెబనాన్ బీరూట్‌లో హిజ్బుల్లా కమాండర్ షుక్ర్ ని ఇజ్రాయిల్ వైమానిక దాడిలో చంపేసింది. గురువారం రోజు అక్టోబర్ 07 నాటి దాడులకు కారణమైన హమాస్ కమాండర్ మహ్మద్ దీఫ్‌ని కూడా గత నెలలో గాజాలో ఎయిర్ స్ట్రైక్స్ ద్వారా హతమార్చినట్లు ఇజ్రాయిల్ ప్రకటించింది.

ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్‌పై ఎలాగైనా దాడి చేయాలనే ఆలోచనలో ఇరాన్ ఉన్నట్లు సమాచారం. అయితే, ఎంత తీవ్రంగా దాడులు ఉంటాయనేదానిపై స్పష్టత లేదు. టెల్ అవీవ్, హైఫాలోని ఇజ్రాయిల్ సైనిక సదుపాయాలపై డ్రోన్లు, క్షిపణులతో దాడి చేయాలని ఇరాన్ సైనిక కమాండర్లు పరిశీలిస్తున్నట్లు సమాచారం. దీంతో పాటు యెమెన్, సిరియా, ఇరాక్‌తో సహా మిత్ర రాజ్యాల దళాలతో కలిసి ఇరాన్ దాడి చేయాలని మరో ఆలోచనగా ఉంది. ఇజ్రాయిల్ దాడి ఫలితంగా యుద్ధం విస్తరిస్తే దేశాన్ని రక్షించేందుకు కూడా ప్రణాళికల్ని సిద్ధం చేయాలని సుప్రీం కమాండర్ సాయుధ దళాల్ని ఆదేశించినట్లు తెలుస్తోంది.