Site icon NTV Telugu

Iran: వేలాది మంది నిరసనకారులకు ఇరాన్ క్షమాభిక్ష

Iran

Iran

Iran: ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్న 22,000 మందికి ఇరాన్ న్యాయ అధికారులు క్షమాభిక్ష ప్రకటించారని ఇరాన్‌ న్యాయశాఖ అధిపతి ఘోలామ్‌హోస్సేన్ మొహసేని ఎజీ సోమవారం తెలిపారు. అసమ్మతిపై ఘోరమైన అణిచివేతలో నిరసనలలో అరెస్టయిన కొంతమందితో సహా గత నెల ప్రారంభంలో సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీ పదివేల మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించారని ఆయన వెల్లడించారు. నిరసనల్లో పాల్గొన్న 22,000 మందితో సహా ఇప్పటివరకు 82,000 మంది క్షమాపణలు పొందారని ఎజీ చెప్పారు.

Read Also: Cyclone Freddy: మలావిలో ఫ్రెడ్డీ తుపాను బీభత్సం.. 100 మందికి పైగా మృతి

గత సెప్టెంబర్‌లో ఆ దేశ నైతికత పోలీసుల కస్టడీలో ఇరాన్ కుర్దిష్ యువతి మరణించినప్పటి నుంచి ఇరాన్ నిరసనలతో అట్టుడుకుతోంది. 1979 విప్లవం తర్వాత ఇస్లామిక్ రిపబ్లిక్‌కు ఎదురైన అత్యంత సాహసోపేతమైన సవాళ్లలో ఒకటిగా అన్ని రంగాలకు చెందిన ఇరానియన్లు పాల్గొన్నారు. అణచివేత చర్యల్లో భాగంగా పోలీసుల కాల్పుల్లో వందల మంది చనిపోవడం తెలిసిందే. వచ్చే వారం నుంచి ప్రారంభం కానున్న రంజాన్‌ నెల సందర్భంగా సుప్రీం నేత ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు వివరించారు. తాజా చర్యతో ప్రభుత్వ విధానాలపట్ల దేశ ప్రజల్లో పెల్లుబుకుతున్న ఆగ్రహం తీవ్రతను పాలకులు గుర్తించినట్లయింది.

Exit mobile version