NTV Telugu Site icon

Iran Israel War: దాడుల నేపథ్యంలో అప్రమత్తమైన భారత ఎంబసీ.. హెల్ప్‌లైన్ నంబర్లు అంటూ..!

6

6

తాజాగా మొదలైన ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధంలో భాగంగా… భారతదేశ ప్రభుత్వం ఇజ్రాయిల్ లోని భారతీయులకు కీలక సలహా జారీ చేసింది. మరోసారి పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి చేసిన తర్వాత పరిస్థితి మరింత దిగజారింది. ఇందులో భాగంగా భారత ఎంబసీ తక్షణ సాయం కోసం హెల్ప్ లైన్ నెంబర్లను జారీ చేసింది. అందరూ ఊహించిన విధంగానే ఇజ్రాయిల్ దేశంపై ఇరాన్ ఏకంగా 200 డ్రోన్లు, క్షిపణులతో శనివారం రాత్రి పెద్ద ఎత్తున దాడికి పాల్పడింది. వీటితోపాటు ఇరాన్ మిత్ర దేశాలు కూడా ఇజ్రాయిల్ ను టార్గెట్ చేయడంలో సఫలీకృతమయ్యాయి.

Also read: Nallari Kiran Kumar Reddy: రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ స్ట్రగుల్ స్టార్ గానే ఉన్నారు..

ముఖ్యంగా ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ డ్రోన్స్ సహాయంతో ఇజ్రాయిల్ పై పెద్ద ఎత్తున దాడి చేశాయి. ఈ పరిస్థితులలో ప్రపంచం మొత్తం అప్రమత్తమైంది. ఇకపోతే ఈ దాడికి ఇరాన్ ‘ట్రూ ప్రామిస్’ అనే పేరును పెట్టుకుంది. ఈ సమయంలో భారతదేశ రాయబార కార్యాలయం ఇజ్రాయిల్ లో నివసిస్తున్న భారతీయుల కోసం కీలక సూచనలు జారీ చేసింది.

Also read: Manifesto BJP: బీజేపీ లోక్‌సభ మ్యానిఫెస్టోపై ఆరోపించిన విపక్షాలు..!

ఇజ్రాయిల్ లో నివసిస్తున్న భారత పౌరులందరూ ప్రశాంతంగా ఉండాలని.. స్థానిక అధికారులు జారీచేసిన భద్రత ఏర్పాట్లను అనుసరించి అందుకు తగ్గట్టుగా నడుచుకోవాలని భారత కార్యాలయం తెలిపింది. ఇకపోతే ఎవరికైనా భారతీయుల భద్రత కోసం తక్షణ సాయం కోసం ఇజ్రాయిల్ లోని రాయబారి కార్యాలయాన్ని సంప్రదించాలంటూ అధికారులు కోరారు. ఇందుకోసం ప్రజలకు ఎమర్జెన్సీ నెంబర్స్ కూడా షేర్ చేసింది. వీటితోపాటు మెయిల్ ఐడిను కూడా ఇస్తూ ప్రజలు ఎలాంటి పరిస్థితులైన తమని సంప్రదించవచ్చని తెలిపింది. ఈ నేపథ్యంలో భారతీయులను ఇరాన్, ఇజ్రాయిల్ కు వెళ్ళవద్దని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.