Iran Israel War: ఇజ్రాయెల్ – హిజ్బుల్లా మధ్య కొనసాగుతున్న వివాదం ప్రమాదకర రూపం దాల్చింది. ఈ క్రమంలో నిన్న హిజ్బుల్లా ఇజ్రాయెల్‌పై 130 క్షిపణులను ప్రయోగించింది. ప్రతీకారంగా, IDF వేగవంతమైన దాడిని ప్రారంభించింది. కేవలం ఒక గంట పాటు 100 యుద్ధ విమానాలతో 120 సైట్ లను లక్ష్యంగా చేసుకుంది. దాడికి సంబంధించి, IDF ప్రతినిధి లెబనాన్‌లో నివసిస్తున్న ప్రజలకు తదుపరి నోటీసు వచ్చే వరకు బీచ్‌లో లేదా పడవల్లో ఉండకూడదని హెచ్చరిక జారీ చేశారు. అలాగే ఉత్తర ఇజ్రాయెల్‌లో కొత్త క్లోజ్డ్ మిలిటరీ జోన్‌ను కూడా ప్రకటించారు.
లెబనాన్ లోని హిజ్బుల్లా లక్ష్యాలపై దాడికి సంబంధించి మా ఫైటర్ జెట్‌లు వివిధ విభాగాలను లక్ష్యంగా చేసుకున్నాయని, ఇందులో రద్వాన్ దళాలు, సదరన్ ఫ్రంట్ యొక్క ప్రాంతీయ విభాగాలు, క్షిపణి రాకెట్ దళాలు, ఇంకా ఇంటెలిజెన్స్ విభాగాలు ఉన్నాయని IDF తెలిపింది. ఇజ్రాయెల్ ఆర్మీ హిజ్బుల్లా కమాండ్ అండ్ కంట్రోల్, ఫైరింగ్ యూనిట్‌ను నాశనం చేయడానికి ఈ దాడి జరిగింది. అంతేకాకుండా భూదాడిని మరింత ఉధృతం చేసేందుకు సైన్యం నిరంతరం శ్రమిస్తోంది.
ఇకపోతే ఇజ్రాయెల్ దాడి కారణంగా లెబనాన్‌లో ఇప్పటివరకు 2100 మంది మరణించారు. అలాగే మరోవైపు 11 వేల మందికి పైగా గాయపడ్డారు. అక్టోబరు 7తో హమాస్‌తో జరుగుతున్న యుద్ధంలో ఏడాది పూర్తయింది. అయినప్పటికీ, అక్కడ మరణాల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, యుద్ధంలో ఇప్పటివరకు 42,000 మంది మరణించారని.. వీరిలో 16 వేల మందికి పైగా మహిళలు, పిల్లలు ఉన్నారని., అలాగే 97 వేల మందికి పైగా గాయపడ్డారని తెలిపింది.
crazy visuals of massive Israeli Air strike in Beirut.#Israel #Iran #Lebanon #Beirut #hezbullah #hamas #Pelestine #MiddleEast . pic.twitter.com/3WQVKAx76V
— Geography🌏🏞️ (@GeoStatics7372) October 6, 2024