NTV Telugu Site icon

iQOO Smartphones: ఒకేసారి మూడు మోడళ్ల ఫోన్స్ లాంచ్.. మరి ధరలు ఎలా ఉన్నాయంటే..?!

3

3

రోజురోజుకీ ప్రపంచవ్యాప్తంగా మారుతున్న టెక్నాలజీ కారణంగా మొబైల్ కంపెనీలు ఎప్పటికప్పుడు వాటిని అనుసరిస్తూ కొత్త మోడల్స్ మార్కెట్లోకి తీసుకువస్తుంటాయి. ఇందులో భాగంగానే తాజాగా చైనీస్ టెక్ కంపెనీ iQOO మరోసారి స్టైలిష్ లుక్స్ తో కూడిన స్మార్ట్‌ ఫోన్లను మార్కెట్‌ లోకి తీసుకొస్తుంది. ఈ ఫోన్స్ ను మిడ్ రేంజ్ బడ్జెట్‌ లో ఎక్కువగా ఫోన్లను లాంచ్ చేస్తుంది. ఇక ఈ కంపెనీకి మొబైల్స్‌ కు గ్లోబల్ మార్కెట్‌ లో మంచి డిమాండ్ ఉందనే విష్యం తెలిసిందే.

ఈ నేపథ్యంలో కంపెనీ iQOO నుండి కొత్తగా 3 సిరీస్‌లను లాంచ్ చేసేందుకు సిద్దమైంది. వీటిని ఏప్రిల్ 24న చైనాలో ఈ ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేయనున్నారు. ఇక ఫోన్ మోడల్స్ iQOO Z9, Z9x, Z9 Turbo గా వేరియంట్లు ఉన్నాయి. ఇక వీటికి సంబంధించి ధరలు, ఫీచర్లు తదితర విషయాలు ఓసారి చూద్దాం..

iQOO Z9 ఆక్టా కోర్ స్నాప్‌ డ్రాగన్ 7 Gen 3 చిప్‌ సెట్‌ ను కలిగి ఉండి., 80W ఫాస్ట్ ఛార్జింజ్ సపోర్ట్‌ తో వస్తుంది. ఇక ఈ మోడల్ లో 12GB RAM + 256GB, 12GB RAM + 512GB రెండు స్టోరేజ్ వేరియంట్స్ అందుబాటులో ఉన్నాయి. అలాగే iQOO Z9x స్నాప్ డ్రాగన్ 6 Gen 1 SoC ప్రాసెసర్‌ పై వస్తోంది. ఇది 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ చేస్తుండగా.. Z9x 8GB RAM + 256GB, 12GB RAM + 256GB వంటి రెండు స్టోరేజ్ వేరియంట్స్ లో మార్కెట్‌లోకి వస్తోంది.

ఇక iQOO Z9 మార్చిలో 3C అథారిటీ సర్టిఫికేషన్ కోసం అప్లై చేసుకుంది. అలానే వివో V2352A ఫోన్ చైనా మార్కెట్‌ లో iQOO Z9 టర్బోగా విడుదల చేస్తున్నట్లు తెలిపింది. స్మార్ట్‌ఫోన్ ఖ్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 8s Gen 3 చిప్‌ తో వస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ఫోన్స్ లో 6000mAh పవర్ ఫుల్ బ్యాటరీ అందించనున్నారు. వీటితోపాటు గ్రాఫిక్స్ కోసం ఫోన్ లో ప్రత్యేకమైన చిప్ ఉంటుంది. వీటితోపాటు ఫోన్ హీట్ కంట్రోల్ చేయడానికి 6K VC కూలింగ్ సిస్టమ్ కలిగి ఉంటుంది. ఇక ఈ ఫోన్ 16 GB ర్యాంతో వస్తుంది. ఆండ్రాయిడ్ 14పై ఈ ఫోన్ రన్ అవుతుంది. iQOO Z9 టర్బో 16GB RAM + 256GB, 16GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్స్ లో వచ్చే అవకాశం కనపడుతోంది.