NTV Telugu Site icon

iQOO Neo 9 Pro Launch: ఐకూ నుంచి మరో ఫ్లాగ్‌షిప్‌ ఫోన్‌.. 50 ఎంపీ కెమెరా, 5160 ఎంఏహెచ్‌ బ్యాటరీ!

Iqoo Neo 9 Pro

Iqoo Neo 9 Pro

iQOO Neo 9 Pro 5G Smartphone Launched in India: చైనాకు చెందిన మొబైల్‌ కంపెనీ ‘ఐకూ’ భారత మార్కెట్‌లో మరో స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది. నియో సిరీస్‌లో భాగంగా ‘ఐకూ నియో 9ప్రో’ని గురువారం భారతదేశంలో లాంచ్ చేసింది. ఐకూ 9 సిరీస్ గత డిసెంబర్ చివరిలో చైనాలో ప్రారంభమైంది. 50 ఎంపీ సోనీ ఐఎంఎక్స్‌ 920 సెన్సర్‌ కెమెరా, 5160 ఎంఏహెచ్‌ బ్యాటరీతో ఈ ఫోన్ వస్తుంది. ఇందులో ఔటాఫ్‌ది బాక్స్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత ఫన్‌టచ్‌ ఓఎస్‌తో పాటు మరో మూడు ఆండ్రాయిడ్‌ అప్‌డేట్స్‌ ఇస్తామని ఐకూ పేర్కొంది.

iQOO Neo 9 Pro Offers:
ఐకూ నియో 9 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాలు ఫిబ్రవరి 23 నుంచి ఆరంభం రానున్నాయి. ప్రీ బుక్‌ చేసుకున్న వారు ఫిబ్రవరి 22 మధ్యాహ్నం నుంచే కొనుగోలు చేయొచ్చు. అయితే బేస్‌ వేరియంట్ మాత్రం మార్చి 21న నుంచి అందుబాటులోకి వస్తుంది. ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌, ఐకూ ఇ-స్టోర్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్‌ కార్డులపై కొనుగోలు చేస్తే రూ.2వేల వరకు డిస్కౌంట్‌ పొందొచ్చు.

iQOO Neo 9 Pro Price:
ఐకూ నియో 9 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌ మూడు వేరియంట్లలో లభిస్తుంది. బేస్‌ వేరియంట్‌ 8జీబీ+128జీబీ ధర రూ.35,999 కాగా.. 8జీబీ+256జీబీ వేరియంట్‌ ధర రూ.37,999గా ఉంది. ఇక హై ఎండ్ 12జీబీ+256 జీబీ వేరియంట్‌ ధర రూ.39,999గా ఉంది. ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌ నలుపు, ఎరుపు రంగుల్లో లభిస్తుంది.

iQOO Neo 9 Pro Specs:
ఐకూ నియో 9 ప్రోలో 6.78 ఇంచెస్ 1.5k ఎల్‌టీపీఓ అమోలెడ్‌ డిస్‌ప్లే ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్‌ రేటు కలిగి ఉండగా.. గేమింగ్ సమయంలో 144Hz రిఫ్రెష్‌ రేటుతో పని చేస్తుంది. కొత్తగా వెట్‌ టచ్‌ టెక్నాలజీని ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఇచ్చారు. దీంతో తడి చేత్తో ఫోన్‌ను ఆపరేట్‌ చేసినా… డిస్‌ప్లే పని చేస్తుంది. స్నాప్‌డ్రాగన్‌ 8 జనరేషన్‌ 2 చిప్‌సెట్‌తో ఇది వస్తోంది.

Also Read: Yashasvi Jaiswal: బాంద్రాలో ఖరీదైన ఫ్లాట్‌ కొన్న యశస్వి జైస్వాల్‌.. ధర ఎంతంటే?

iQOO Neo 9 Pro Camera and Battery:
ఐకూ నియో 9 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 50ఎంపీ సోనీ ఐఎంఎక్స్‌ 920 సెన్సర్‌ ప్రధాన కెమెరా ఇచ్చారు. ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌తో ఇది వస్తోంది. 8 ఎంపీ అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరా కూడా ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 16 ఎంపీ కెమెరాఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5,160 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉండగా.. ఇది 120W సూపర్‌వూక్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.